ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ భారత్ జట్లను క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా చిరకాల ప్రత్యర్ధులు అని పిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు ఎప్పుడు తలబడిన కూడా అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కళ్ళు కాస్త పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటారు. అయితే పాకిస్తాన్, భారత్ తర్వాత ఆ రేంజ్ లో చిరకాల ప్రత్యర్థులుగా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు అని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మేటి జట్లుగా కొనసాగుతున్న ఈ రెండు టీం ల మధ్య ఎప్పుడు పోరు జరిగిన కూడా అది ఎంతో రసవతారంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.


 నువ్వా నేనా అన్నట్టుగా ఇక ఇరుజట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ రెండు జట్ల మధ్య ఆట ఎంత రసవత్తరంగా సాగుతుందో అటు తొండాట కూడా అంతే జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  చివరి వన్డే మ్యాచ్లో కూడా ఇలాంటి ఆసక్తికర ఘటనే జరిగింది. స్విత్ అవుట్ విషయంలో అంపైర్ తీసుకున్న నిర్ణయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. గత రెండు వన్డేల నుంచి మంచి పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర వహించిన స్మిత్ ఇటీవల మూడో వన్డేలో మాత్రం క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కాస్త ఇబ్బంది పడ్డాడు.


 ఈ క్రమంలోనే హోలీ స్టోన్ బౌలింగ్ లో షాట్ కు ప్రయత్నించి మిస్ చేశాడు. అయితే బంతి స్మిత్ గ్లోవ్స్ కి తాగుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే బట్లర్ అవుట్ అంటూ అప్పీల్ కు వెళ్లాడు. కానీ ఎంపైర్ మొదట అవుట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో బట్లర్ ఏమాత్రం ఆలోచించకుండా డిఆర్ఎస్ కావాలి అన్నట్లుగా సైగ చేశాడు. అయితే ఇది గమనించిన అంపైర్ బట్లర్ నిర్ణయానికి మొగ్గు చూపుతు తన వేలిని పైకెత్తి చూపాడు. ఇది చూసిన స్మిత్ మొదట షాక్ అయినప్పటికీ ఇక ఎంపైర్ నిర్ణయానికి కట్టుబడి పెవిలియన్ చేరాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడంతో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య తొండాట జరగడం అంటే ఇదే అంటూ కామెంట్ చేస్తున్నారు ఎంతోమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: