గత కొంతకాలం నుంచి ద్వైపాక్షిక సిరీస్ లలో  భారత జట్టు హవా నడిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన సమయంలో.. మరికొన్నిసార్లు రోహిత్ శర్మకు విశ్రాంతి ప్రకటించి ఇక తాత్కాలిక కెప్టెన్గా మరొకరిని నియమించిన సమయంలో కూడా టీమ్ ఇండియా విజయపరంపర కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. వరుసగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో సిరీస్ లలో విజయం సాధిస్తూ ఇక తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. టీమిండియా విదేశీ పర్యటనకు వెళ్ళినా.. లేకపోతే విదేశీ జట్టు భారత పర్యటనకు వచ్చిన అదే రీతిలోరాణిస్తుంది టీమ్ ఇండియా.


 ఇకపోతే ఇటీవల వరల్డ్ కప్ ముగిసిన తర్వాత సీనియర్లకు విశ్రాంతి ప్రకటించినప్పటికీ కూడా అటు ఎంతో మంది యువ ఆటగాళ్ళతో కూడిన టీమిండియా జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది. అక్కడ మొదట హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీ20 సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. టి20 సిరీస్ లో భాగంగా భారత జట్టు శుభారంభం చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడు మ్యాచ్లో టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షార్పణం అయింది. కానీ ఆ తర్వాత రెండో మ్యాచ్ జరిగింది. రెండో మ్యాచ్ లో టీమిండియ 65 పరుగులు తేడాతో విజయం సాధించింది.



 ఇటీవల భారత్ న్యూజిలాండ్ మధ్య ఆఖరి టీ20 మ్యాచ్ లో భాగంగా వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడడంతో డక్ వార్త్ లూయిస్ పద్ధతి ఆధారంగా ఇక అటు మ్యాచ్ టైగా ప్రకటించారు ఎంపైర్లు. దీంతో ఇక మూడు మ్యాచ్లో టి20 సిరీస్ లో ఒక మ్యాచ్ రద్దు కావడం.. మరో మ్యాచ్ టై కావడం ఇంకో మ్యాచ్లో టీమ్ ఇండియా విజయం సాధించడంతో ఒక్క పాయింట్ సాధించిన టీమ్ ఇండియా సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. ఇలా హార్దిక్ పాండ్యా మరోసారి తన కెప్టెన్సీ తో ఆకట్టుకుని జట్టుకు సిరీస్ ని కట్టబెట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: