ఈ సంవత్సరం జరిగిన టీ 20 వరల్డ్ కప్ కొన్ని జట్లకు మరపురాని గుర్తుగా మిగిలిపోగా , మరికొన్ని జట్లకు చేదు జ్ఞాపకంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆస్ట్రేలియా లో జరిగిన ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ ను ఓడించి టైటిల్ ను దక్కించుకుంది. ఇక టైటిల్ కు ఫేవరెట్ లుగా అనుకున్న ఇండియా , న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా లు అంచనాలను అందుకోలేక చతికిలపడ్డారు. బట్లర్ కెప్టెన్సీ లో ఇంగ్లాండ్ టైటిల్ ను అందుకుని యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని అందరూ నిలబెట్టుకున్నారు. టోర్నీ ముగిసిన వెంటనే మళ్ళీ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. వరల్డ్ కప్ కు ముందే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ల మధ్య మూడు టీ 20 లు జరుగగా అందులో ఇంగ్లాండ్ 2-0 తేడాతో సిరీస్ ను దక్కించుకుంది.

కానీ తాజాగా మూడు వన్ డే ల సిరీస్ ఈ రెండు జట్ల మధ్యన ఈ రోజుతో ముగిసింది. కానీ ఈ సిరీస్ టీ 20 ఛాంపియన్ ఇంగ్లాండ్ కు పీడకల లాంటిది అని చెప్పాలి. మొదటి వన్ డే లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండవ వన్ డే లో ఆస్ట్రేలియా 72 పరుగుల తేడాతో మ్యాచ్ ను మరియు సిరీస్ ను చేజిక్కించుకుంది. ఇక నామమాత్రం అయిన మూడవ వన్ డే లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలన్న కసితో బరిలోకి దిగిన బట్లర్ సేనకు భారీ ఓటమి తప్పలేదు. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆసీస్ ఓపెనర్లు వార్నర్ (106) మరియు హెడ్ (152) లు సెంచరీలతో ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడారు.

అలా ఆస్ట్రేలియా వర్షం కారణంగా కుదించిన 48 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓలీ స్టోన్ ఒక్కడే వికెట్లు 4 సాధించి టాప్ బౌలర్ గా నిలిచాడు. ఆ తరువాత 364 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కేవలం 142 పరుగులకే కుప్పకూలిపోయి భారీ ఓటమిని చవిచూసింది. దీనితో మూడు వన్ డే ల సిరీస్ ను కోల్పోయి క్లీన్ స్వీప్ కు గురయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: