ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు వరుస మ్యాచ్లతో బిజీబిజీగా గడుపుతుంది అన్న విషయం తెలిసిందే. సీనియర్లుగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ మరి కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం  పాండ్యా కెప్టెన్సీలో టీ20 సిరీస్ ఆడింది టీం ఇండియా. ఇక నేటి నుంచి శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది అని చెప్పాలి. అయితే ఇటీవల జరిగిన టి20 సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది టీం ఇండియా జట్టు. ఇక ఇప్పుడు అదే జోరును వన్డే సిరీస్ లో కూడా కొనసాగించేందుకు సిద్ధమైంది అని చెప్పాలి.


 ఇకపోతే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో స్థానం కోసం ఎదురుచూస్తున్న యువ ప్లేయర్లు సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లకు  న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టి20, వన్డే జట్టులో కూడా చోటు దక్కింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ లోని ఫాస్ట్ బౌలింగ్ పిచ్ లపై సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్ తప్పకుండా తుది జట్టులోకి వస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో టి20 సిరీస్ లో ఇద్దరికీ అస్సలు చోటు దక్కలేదు. దీంతో కావాలనే ఈ ఇద్దరిపై వివక్ష చూపుతున్నారు అంటూ విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి.


 అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్న సమయంలో ఎలాగో సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లకు చోటు దక్కలేదు. కనీసం ఇక శిఖర్ ధావన్ కెప్టెన్సీ లో వన్ డే సిరీస్ ఆడుతున్న టీమిండియా జట్టులో అయినా అవకాశం దక్కించుకుంటారా లేదా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక అభిమానులు  కోరుకున్నట్లుగానే సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లకు తుది జట్టులో చోటు దక్కింది. ఇటీవలే మొదటి వన్డే కోసం అటు టీమిండియా యాజమాన్యం తుది జట్టును ప్రకటించక ఇందులో సంజు శాంసన్,, ఉమ్రాన్ మాలిక్ పేర్లు కనిపించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మరీ ఈ ఇద్దరూ ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: