ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు భారత జట్టు ఎంతలా నిరాశపరిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైటిల్ గెలిచి ఇక స్వదేశానికి వస్తుంది అనుకున్న టీమిండియా సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే అప్పటివరకు సూపర్ 12 మ్యాచ్లలో కొంతమంది ఆటగాళ్ల పుణ్యమా అని వరుస విజయాలు సాధించిన టీమ్ ఇండియా అటు సెమీఫైనల్ లో మాత్రం సత్తా చాట లేకపోయింది.


 ప్రపంచ క్రికెట్లో మేటిజట్టుగా కొనసాగుతున్న భారత జట్టు అటు ఇంగ్లాండ్ కు సెమీఫైనల్ లో కనీస పోటీ ఇవ్వలేక ఘోర ఓటమి  చవిచూసింది. దీంతో ఇది అటు బీసీసీఐపై ఎంతగానో ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే రాబోయే వరల్డ్ కప్ లను దృష్టిలో పెట్టుకుని జట్టులో అనూహ్యమైన  మార్పులు తీసుకురావాలని బీసీసీ పెద్దలు నిర్ణయించారు. ముఖ్యంగా వచ్చేయడాది భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక  ఇదే విషయంపై ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్ లో టీమ్ ఇండియా కెప్టెన్గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 వచ్చే వన్డే ప్రపంచ కప్ లో భాగంగా భారతదేశం లో చోటు దక్కించుకోవాలని.. యువ ఆటగాళ్లు అందరికీ కూడా న్యూజిలాండ్ సిరీస్ ఒక అద్భుతమైన అవకాశం అంటూ శికర్ ధావన్ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది జరగబోయే వరల్డ్ కప్ కోసం ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయని... ఇప్పటికైనా యువ క్రికెటర్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటాల్సిన అవసరం ఉంది అంటూ శికర్ ధావన్ తెలిపాడు. కాగా నేటి నుంచి అటు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుండగా.. యువ ఆటగాళ్లు ఎలా సత్తా చాటుతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: