ప్రేమ అనేది ఒక మధురమైన జ్ఞాపకం. ఎప్పుడు ఎవరి మధ్య ఏ క్షణంలో ప్రేమ పుడుతుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. కేవలం క్షణకాల వ్యవధిలో కలిసిన రెండు మనసులు ఇక జీవితాంతం కలిసి ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి అని చెప్పాలీ. అయితే ఇవన్నీ కేవలం సినిమాల్లో వినిపించే మాటలు. కానీ నిజజీవితంలోకి వస్తే మాత్రం ప్రేమ మోసం చేయడానికి ఒక ఆయుధంగా మారిపోయింది అని చెప్పాలి. ప్రేమ ముసుగు వేసుకొని అవసరాలు తీర్చుకొని ఇక ప్రేమించిన వారిని మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక ప్రేమికుల మధ్య సరైన బాండింగ్ లేకపోవడంతో ఏకంగా ప్రేమలో ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు దారుణంగా అనుమానించడం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలా ప్రేమ కారణంగా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు అయితే సభ్య సమాజాన్ని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి వింతైన ఘటన గురించి. ఒక యువతి తన ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన కాస్త సంచలనగా మారిపోయింది అని చెప్పాలి.


 ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ లో వెలుగులోకి వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ కి వీడియో కాల్ చేసిన సమయంలో మరో మహిళ ఫోన్ తీసింది. దీంతో వీడియో కాల్ లో బాయ్ ఫ్రెండ్ కి బదులు మరో మహిళను చూసిన యువతి కోపంతో ఊగిపోయింది. వెంటనే బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి నిప్పు పెట్టేసింది. ఈ ఘటనలో అతని ఇంట్లోనే కొన్ని వస్తువులు కాలిపోయాయి. 40 లక్షల ఆస్తి నష్టం జరిగింది. మరికొన్ని వస్తువులను సదరు యువతీ ఎత్తుకెళ్లింది. కాగా ఇలా ఈ ఘటనకు పాల్పడిన 23 ఏళ్ల మేరీ సొటోను అరెస్టు చేశారు పోలీసులు. అయితే వీడియో తీసిన మహిళ మేరీ బాయ్ ఫ్రెండ్ కు బంధువు అన్న విషయం పోలీసు విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: