ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతూ ఉన్నారు సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ. ఇక వీరిద్దరి గణాంకాల విషయంలో పోలికలు లేకపోయినప్పటికీ ఇక ఇద్దరూ ఆటతీరులో మాత్రం కొన్ని పోలికలు ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు విరాట్ కోహ్లీ జట్టులోకి అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే తాను ఫ్యూచర్ స్టార్ అన్న విషయాన్నీ నిరూపించుకొని అదరగొట్టాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ సైతం మూడు పదుల వయసులో భారత జట్టులోకి వచ్చినప్పటికీ తక్కువ సమయంలోనే అగ్రశ్రేణి బ్యాటర్ గా ఎదిగాడు అనే విషయం తెలిసిందే.


 అయితే ఇక గత కొంతకాలం నుంచి కఠిన పరిస్థితుల్లో భారీగా పరుగులు చేస్తూ టీమ్ ఇండియాకు విజయాలను అందిస్తున్నారు ఈ ఇద్దరు క్రికెటర్లు. మొన్నటికీ మొన్న ప్రపంచకప్ లో భాగంగా సూపర్ 12 మ్యాచ్లలో భారత జట్టు వరుసగా విజయం సాధించింది అంటే అది విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ ల బ్యాటింగ్ చలవే అని చెప్పాలి. ఎందుకంటే కష్ట సమయాల్లో తమ బ్యాటింగ్తో విజృంభించిన ఈ ఇద్దరు ప్లేయర్లు భారీగా పరుగులు చేశారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో కోహ్లీ 296 పరుగులు చేసి టాప్  స్కోరర్ గా నిలిస్తే.. ఇక సూర్యకుమార్ 239 పరుగులు చేశాడు.


 అయితే వీరిద్దరి విషయంలో యాదృచ్ఛికంగా జరిగిన కొన్ని గణాంకాలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇంతకీ ఆ గణాంకాలు ఏంటంటే.. పొట్టి క్రికెట్లో భీకరమైన ఫామ్ లో కొనసాగుతున్న ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా తమ టి20 కెరియర్లో 9వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును 39వ ఇన్నింగ్స్ లోనే అందుకున్నారు. ఇలా విరాట్ కోహ్లీ 39వ టీ20 ఇన్నింగ్స్ లోనే తన  కెరియర్ లో 9వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగా.. మొన్నటికి మొన్న సూర్య కుమార్ యాదవ్ సైతం తన 39వ టి20 ఇన్నింగ్స్ లోనే తొమ్మిదవ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: