ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లలో యువ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ కూడా ఒక్కడు అన్న విషయం తెలిసిందే. వెంకటేష్ అయ్యర్ ఐపిఎల్ లో మంచి ప్రదర్శన చేస్తున్న సమయానికి సరిగ్గా భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా ఉన్న  పాండ్యా పేలవ పరదర్శనతో నిరాశ పరుస్తూ ఉండడం..  ఇక వరుస గాయాలు వేధిస్తూ ఉండడంతో అతని స్థానంలో వెంకటేష్ అయ్యర్ కి అవకాశం కల్పించారు.


 ఈ క్రమంలోనే గత ఏడాది ఇదే సమయానికి న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు వెంకటేష్ అయ్యర్. ఇక జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం హార్థిక్ పాండ్యా గాయాలనుంచి కోలుకుని పూర్తిగా ఫిట్నెస్ సాధించడంతో వెంకటేష్ అయ్యర్ జట్టులో కొనసాగేందుకు అన్ని అవకాశాలు మూసుకుపోయాయి. ఇదే విషయంపై స్పందించిన వెంకటేష్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియాలో ఎక్కువ కాలం కొనసాగాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడు.


 అందరిలాగా నేను కూడా అదే అనుకున్నాను. కానీ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చిన పరిస్థితులు నాకు బాగా తెలుసు. అతడు చేసింది ఒక అద్భుతం అని చెప్పాలి. అయితే ప్రపంచకప్ కోసం ఉత్తమ జట్టును ఎంపిక చేసుకోవాలని అని జట్లు కోరుకుంటాయి.  ఇక నేను టీమిండియా తరఫున ప్రపంచ కప్ లో ఆడాలనుకున్నాను. కానీ అది మన చేతుల్లో లేదు. నేను ఎప్పుడు క్రికెట్ ని ఒక అవకాశం గా చూస్తాను. ప్రధాన జట్టులో చోటు తగ్గకపోతే భారతీ టి20 లీగ్.. అది లేకపోతే దేశీయ క్రికెట్లో సొంత రాష్ట్రం తరఫున ఆడుతాను. ఒక క్రికెటర్ గా ఎక్కడ ఆడిన మంచి ప్రదర్శన చేయడమే నా పని.. సెలక్షన్ గురించి ఆలోచించను అంటూ వెంకటేష్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: