ఒక్కసారి కూడా ఐసీసీ టోర్నీలో కప్పు గెలవని కెప్టెన్గా అపవాది మూటగటుకున్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి అంటూ డిమాండ్స్ రావడంతో చివరికి సారధ్య బాధ్యతలను వదులుకున్నాడు విరాట్ కోహ్లీ.  ఆ తర్వాత రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్గా వ్యవహరించాడు అని చెప్పాలి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అయినా టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అనుకుంటే.. 2021 వరల్డ్ కప్ లో రోహిత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత జట్టు తీవ్రంగా నిరాశపరిచింది.


 రోహిత్ శర్మను కూడా అటు కెప్టెన్సీ నుంచి తప్పించి యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు తెర మీదకి వచ్చాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్సీ వహించి ఇక మొదటి సీజన్ లోనే టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యాను టీమ్ ఇండియాకు టి20 కెప్టెన్ గా మారిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక మాజీ ఆటగాళ్లు కూడా దీంతో ఏకీభవిస్తూ ఉండడం  గమనార్హం. ఇకపోతే ఇటీవల కెప్టెన్సీ మార్పుపై మాజీ లెగ్ స్పిన్నర్ హర్భజన్   స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 రోహిత్ శర్మ తర్వాత భారత జట్టుకు టి20 ఫార్మాట్లో కెప్టెన్ గా ఎవరు ఉంటారు అన్న విషయం పై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇదే ప్రశ్న తనకు ఎదురైతే మాత్రం నేను రోహిత్ తర్వాత భారత టి20 జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పేరుని సూచిస్తాను అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. అయితే టి20 ఫార్మాట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా లేదా అనే విషయంపై మాత్రం నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. ఎందుకంటే వారు ఇద్దరు కూడా నాణ్యమైన ఆటగాళ్లు. ఫిట్ గా ఉంటే కచ్చితంగా ఆడతారు అంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: