గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్ లకు ఇండియా రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ గాయంతో మ్యాచ్ లకు దూరం అయినా, లేదా విశ్రాంతి ఇచ్చిన సమయంలో తాత్కాలిక వన్ డే టీం కు కెప్టెన్ గా సీనియర్ లైఫ్ హ్యాండ్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ కు బాధ్యతలు అప్పగిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్ డే సిరీస్ కు గబ్బర్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు ఆక్లాండ్ వేదికగా మొదటి వన్ డే జరుగుతోంది. టాస్ గెలిచిన ఆతిధ్య న్యూజిలాండ్ ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది. దానికి ప్రతిగా ఇండియా ధీటుగా సమాధానం ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.

అయితే ఓపెనర్లు శిఖర్ ధావన్ (72) మరియు శుబ్మాన్ గిల్ (50) లు మొదటి వికెట్ కు ఇద్దరూ అర్ద సెంచరీలు సాధించి శుభారంభాన్ని ఇచ్చినా ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ముఖ్యంగా వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పంత్ మరియు సూర్యకుమార్ యాదవ్ లు విఫలం అయ్యారు. ఇదిలా ఉంటే కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ మొదటి బంతి నుండి ఆచితూచి ఆడుతూ బ్యాటింగ్ ను ఎంజాయ్ చేశాడు. తన స్కోరు లో మొత్తం 13 బౌండరీలు ఉన్నాయి. ఎంతో చూడచక్కని కవర్ డ్రైవర్ లు, లోఫ్టెడ్ షాట్ లతో గ్రౌండ్ కు నాలుగు వైపులా షాట్ లు ఆడి ప్రేక్షకులను అలరించాడు.

ఇక వన్ డే వరల్డ్ కప్ కు నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండడంతో జట్టులో చోటు దక్కించుకోవడానికి అందరూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. శిఖర్ ధావన్ కు కూడా జట్టులో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. వన్ డే లలో ఓపెనర్ గా వికెట్ కోల్పోకుండా మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేస్తే సరిపోతుంది. ఈ రోజు శిఖర్ ధావన్ అలంటి ఇన్నింగ్స్ ను ఆడాడు. ఇలాగే ముందు ముందు మ్యాచ్ లలో ఆవేశ పడకుండా పరుగులు చేస్తే వరల్డ్ కప్ లో ఖచ్చితంగా శిఖర్ ధావన్ కు ఛాన్స్ ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: