గత కొంతకాలం నుంచి టీమిండియా ఆడిన అన్ని వన్డే మ్యాచ్ లలో  కూడా అవకాశం దక్కించుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ఎంతో నిలకడైనా ఫామ్ ను కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా మంచి పరుగులు చేస్తూ ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఫామ్ చూస్తే రానున్న రోజుల్లో ఏకంగా భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో అతడు కీలక ఆటగాడిగా మారబోతున్నాడు అన్నది మాత్రం అర్థమవుతుంది. ఇకపోతే ఇటీవల భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆడిన మొదటి వన్డే మ్యాచ్లో ఓడిపోయింది అని చెప్పాలి.


 అయితే భారత జట్టు ఓడిపోయినప్పటికీ అటు జట్టులోని కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది అని చెప్పాలి. ఇలా తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లలో శ్రేయస్ కూడా ఉన్నాడు. ఏకంగా మొదటి వన్డే మ్యాచ్లో అర్థ శతకంతో మెరిసాడు శ్రేయస్ అయ్యర్. తద్వారా ఏకంగా ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఏ భారత ఆటగాడికి సాధ్యం కానీ ఒక రికార్డును శ్రేయస్ అయ్యర్ సాధించాడు అని చెప్పాలి. న్యూజిలాండ్ గడ్డమీద వన్డే ఫార్మాట్లో వరుసగా నాలుగు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.


 పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమిజ్ రాజా ఇక ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ కంటే ముందు వరసలో ఉన్నాడు అని చెప్పాలి.  కాగా గత ఎనిమిది వన్డేలలో కలిపి భారత తరఫున శ్రేయస్  ఐదు అర్థ శతకాలు ఒక శతకం సాధించడం గమనార్హం. ఇక ఇందులో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్ లో అయ్యర్ ఒక శతకం మూడు అర్థ శతకాలు సాధించాడు.  దీంతో ఇలా వరుసగా న్యూజిలాండ్ గడ్డపై నాలుగు సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు శ్రేయస్ అయ్యర్.

మరింత సమాచారం తెలుసుకోండి: