ఐపీఎల్ ద్వారా ఎంతోమంది యువ క్రికెటర్లు తమ ప్రతిభను చాటి టీమిండియాలోకి అరంగేట్రం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కొంతమంది క్రికెటర్లు ప్రతిభ చాటినప్పటికీ టీమిండియాలో ఛాన్స్ మాత్రం కాస్త ఆలస్యంగానే వస్తుంది. కానీ కొంతమంది మాత్రం కేవలం ఒకే ఒక ఐపిఎల్ సీజన్తో ఇక టీమ్ ఇండియాలో అవకాశాన్ని దక్కించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలో  అరంగేట్రం చేసి ఆకట్టుకున్న యువ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఉమ్రాన్ మాలిక్ అని చెప్పాలి.


 అప్పుడు వరకు టీమిండియాలో ఉన్న బౌలర్లకు ఎవరికి సాధ్యం కాని రీతిలో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ఒకసారిగా భారత క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు ఉమ్రాన్ మాలిక్. ఇక రానున్న రోజుల్లో భారత బౌలింగ్ విభాగానికి ఫ్యూచర్ స్టార్ తానే అన్న విషయాన్ని తన బౌలింగ్ తో ఎంతోమందిలో నమ్మకాన్ని కలిగించాడు అని చెప్పాలి. ఇలా ఐపీఎల్ లో ఆకట్టుకుని టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేసాడు. కానీ ఆ తర్వాత భారీగా పరుగులు సమర్పించుకోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.


 ఇక ఎన్నో రోజుల తర్వాత ఇటీవలే న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ లో అవకాశం దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్ మరోసారి తన స్పీడ్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను విసురుతూ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను భయపెట్టాడు. తక్కువ పరుగులు ఇవ్వడమే కాకుండా ఇక రెండు వికెట్లు కూడా పడగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనిపై మాజీ ప్లేయర్ జహీర్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్లో వేగమే ఉమ్రాన్ మాలిక్ అతిపెద్ద బలం. అరంగేట్రం ఆటగాడిగా గొప్ప ప్రదర్శన చేశాడు. ఉమ్రాన్ ఫేస్ ను అస్సలు వదలొద్దు వీలైనంత వేగంగా బంతులు వేయాలి అంటూ జహీర్ ఖాన్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: