ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అయితే మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఏ కెప్టెన్ కి కూడా అటు టి20 వరల్డ్ కప్ లో టైటిల్ గెలవడం సాధ్యం కాలేదు అని చెప్పాలి. ఈ కారణంగానే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి అంటూ డిమాండ్లు రాగా.. కోహ్లీ నిజంగానే టి20 కెప్టెన్సీ వదిలేసాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరు సంపాదించుకున్న రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.


 ఇక టీమిండియా కు ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలు అందించిన రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ లో కూడా తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేసి టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందిస్తాడని అందరూ అనుకున్నారు. 15 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుందని ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో లీగ్ దశ నుంచి పేలవ  ప్రదర్శన చేస్తూ పోయిన టీమిండియా ఇక సెమి ఫైనల్లో పటిష్టమైన ప్రత్యర్థి ఎదురు కావడంతో చివరికి ఘోర ఓటమి చవిచూసి ఇంటిదారి పట్టింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపై కెప్టెన్సీ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.


 రోహిత్ శర్మను సైతం కెప్టెన్సీ నుంచి తప్పించి  పాండ్యాకు సారధ్య బాధ్యతలు  అప్పగించాలి అంటూ ఎంతో మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవలే రోహిత్ పై వస్తున్న విమర్శలపై రోహిత్ చిన్ననాటి కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అందరూ టి20 ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శనకు రోహిత్ శర్మని మాత్రమే నిందిస్తున్నారు. అయితే రోహిత్ ఒక్కడిని మాత్రమే నిందించడం సరికాదు. టి20 ప్రపంచ కప్ లో  ఇండియా ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: