భారత క్రికెట్ నియంత్రణ మండలిలో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయా అంటే గత కొంతకాలం నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే బీసీసీఐ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేసినప్పటికీ కూడా జట్టులో ఎంపిక చేయకపోవడం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఈ క్రమంలోనే బీసీసీఐపై ఎంతోమంది అభిమానులు బహిరంగంగానే విమర్శలు చేస్తూ నిరసనలు కూడా చేస్తున్న ఘటనలు వెలుగు చూసాయ్.


 ఇదిలా ఉంటే ఇక ఇటీవల రవీంద్ర జడేజా విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. సరిగ్గా వరల్డ్ కప్ ముందు రవీంద్ర జడేజా లాంటి కీలకమైన ఆల్ రౌండర్ మోకాలి గాయం కారణంగా ఇక వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. శస్త్ర చికిత్స చేసుకొని రవీంద్ర జడేజా ప్రస్తుతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలోనే వచ్చే నెలలో జరగబోయే బంగ్లాదేశ్ టూర్ లో భాగంగా రవీంద్ర జడేజాను జట్టులో ఎంపిక చేసింది యాజమాన్యం.


 ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా అటు జడేజా విషయం  లో మరో సారి జట్టు యాజమాన్యం యూటర్న్ తీసుకుంది అని చెప్పాలి.  అతను ఇంకా పూర్తిగా కోలు కోలేదు బంగ్లాదేశ్ టూర్ కి దూరమయ్యాడు అంటూ తెలిపింది. అయితే జడేజా మాత్రం గుజరాత్ ఎన్నికల్లో నార్త్ జామ్ నగర్ నుంచి పోటీ చేస్తున్న అతని భార్య రివాబా కోసం ప్రచారంలో మునిగిపోయాడు. ఇలా ప్రచారం కోసమే జడేజాను బంగ్లాదేశ్ టూర్ నుంచి తప్పించారు అంటూ విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఇక టీమిండియా జెర్సీలో ఉన్న ఫోటోతోనే బిజెపి ప్రచారం చేస్తూ ఉండటంపై అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: