టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. అభిమానులు అందరూ కూడా ఇతన్ని ఎంతో ముద్దుగా మిస్టర్ కూల్ ధోని అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇక ధోనీకి ఇలా మిస్టర్ కూల్ అని పేరు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అని చెప్పాలి. ఒకవైపు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ధోని మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు.  ఇక మ్యాచ్ ఓడిపోయిన సమయంలో అందరూ నిరాశలో మునిగిపోతూ ఉంటారు. కానీ ధోని మాత్రం ఎప్పుడూ హావభావాలను లోపలే దాచుకుంటూ ఉంటాడు. ధోనిలోపల ఎన్ని ఆలోచనలు పరిగెడుతున్న పైనకు మాత్రం అవి ఎక్కడ కనిపించకుండా కనీసం చిన్న ఎక్స్ప్రెషన్ కూడా లేకుండా కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 ఇలా ధోనినీ చూసినప్పుడు ధోని అసలు మనిషేనా కనీస హావభావాలను ప్రదర్శించకుండా ఎలా ఉంటాడు అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి ధోని ఎప్పుడైనా తనలో ఉన్న మరో మహేంద్రుడిని బయటపెట్టి కాస్త ఎంజాయ్ చేస్తూ కనిపించాడు అంటే చాలు అది కాస్త అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి.  ఇక ఇప్పుడు ఏకంగా మహేంద్రసింగ్ ధోని తన డాన్స్ తో అదరగొట్టిన ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది  అని చెప్పాలి.


 రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఒకవైపు ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ.. మరోవైపు ఇక ఫ్రెండ్స్ తో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఇక ఇటీవలే ఒక బర్త్డే పార్టీలో భాగంగా ధోని అదిరిపోయే డాన్స్ చేసాడు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్లతో కలిసి కాలు కలిపాడు ధోని. ప్రముఖ ర్యాపర్ బాద్ షా పాటలు పాడుతుంటే ఇక ఈ క్రికెటర్లందరూ కూడా స్టెప్పులు వేశారు. ఇందులో ధోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు. అయితే ధోనినీ ఇలా చూడటం చాలా రేర్ కావడంతో అభిమానులు ఈ వీడియోని రివైన్ చేసి మరి మళ్లీ మళ్లీ చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: