ప్రస్తుతం భారత జాతీయ క్రీడగా హాకీ కొనసాగుతూ ఉన్నప్పటికీ ఇక  హాకీ మ్యాచ్లకు మాత్రం పెద్దగా ఆదరణ ఉండదు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో ఉన్న క్రీడాభిమానులందరూ కూడా క్రికెట్ మాయలో మునిగిపోయిన నేపథ్యంలో అటు జాతీయ క్రీడ అయినా హాకీ కి ఎన్నో రోజుల నుంచి ఆదరణ దక్కడం లేదు.  ఇక హాకీ క్రీడాకారులు ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసిన కూడా ఎందుకో పెద్దగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల భారత పురుషుల హాకీ జట్టు అటు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక ఈ సిరీస్ లో భాగంగా ఇటీవల భారత పురుషుల హాకీ జట్టుకు మొదటి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురయింది. ఎందుకంటే ఐదు మ్యాచ్ల సిరీస్ ను ఓటమితో ప్రారంభించింది భారత పురుషుల హాకీ జట్టు. ఇటీవల జరిగిన తొలి మ్యాచ్లో భాగంగా భారత్ నాలుగు గోల్స్ చేసింది. కానీ ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఏకంగా భారత్ ను వెనక్కి నెట్టి ఐదు గోల్స్ సాధించడంతో 5-4 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది అని చెప్పాలి. భారత స్టార్ ప్లేయర్ ఆకాష్ దీప్ సింగ్ ఏకంగా మూడు హ్యాట్రిక్ గోల్స్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. అయినప్పటికీ అతని శ్రమంత వృధా అయింది.


 ఇక మరో గోల్  ను హార్మన్  సింగ్ సైతం ఇక జట్టుకు అందించాడు. ఇక ఒకానొక సమయంలో నాలుగు గోల్స్ తో దూసుకుపోతున్న భారత జట్టు విజయం సాధిస్తుంది అని అనుకున్నప్పటికీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం ఐదు గోల్స్ సాధించడంతో చివరికి భారత జట్టు విజయవకాశాలు పూర్తిగా కనుమరుకైపోయాయి అని చెప్పాలి. ఆస్ట్రేలియా జట్టులో కొనసాగుతున్న బ్లేక్ గోవర్స్ చివరి నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ సాధించడంతో చివరికి ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా తర్వాత మ్యాచ్ లలో అయినా భారత జట్టు సత్తా చాటాలని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: