ఇటీవల కాలం లో యువ ఆటగాళ్లు ఎప్పుడు భారత జట్టు లో చోటు సంపాదించుకుందామా ఎప్పుడెప్పుడు తమ ప్రతిభ తో స్టార్ క్రికెటర్గా ఎదుగుదామా అని ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే వచ్చిన ఏ అవకాశాన్ని వదులు కోకుండా ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే ప్రస్తుతం దేశవాళి టోర్ని అయిన విజయ హాజారే ట్రోఫీ లో కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు రికార్డుల వేట కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఏకంగా సెంచరీల  తో చెలరేగి పోతూ పరుగుల ప్రవాహం పారిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఇలాంటి సెంచరీలు ప్రేక్షకులను ఆశ్చర్య పోయేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. అయితే అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న రూతురాజ్ గైక్వాడ్ ఇక ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అదరగొడుతున్నాడు అని చెప్పాలి.


 వరుస సెంచరీలతో చెలరేగిపోయిన రుతురాజు గైక్వాడ్  మరో అరుదైన రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడమే అద్భుతమైన రికార్డు అనుకున్నాం.  కానీ ఇక్కడ రుతురాజు కైక్వాడ్ మాత్రం ఏకంగా ఆరు బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టి అదరగొట్టేసాడు. ఇటీవలే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 49వ ఓవర్లో ఏకంగా ఏడు సిక్సర్లు  కొట్టాడు. శివ సింగ్ వేసిన బౌలింగ్లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టగా మధ్యలో ఒక నోబాల్ రావడంతో ఇక ఆ బంతిని కూడా సిక్సర్ గా మార్చాడు. మొత్తంగా 159 బంతుల్లో 220 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: