అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లపై గత కొంతకాలం నుంచి వరుణ దేవుడు పగబట్టినట్టుగానే వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికీ మొన్న ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా వర్షాలు ఎంత ఇబ్బంది కలిగించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో కీలకమైన మ్యాచులు వర్షార్పణం కావడంతో కొన్ని జట్లు గడ్డ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా గెలవాల్సిన మ్యాచ్లో కూడా వర్షార్పణం కారణంగా రద్దు కావడంతో కొన్ని జట్లకు పాయింటు కోల్పోయి చివరికి టోర్ని నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 అయితే ప్రస్తుతం భారత జట్టు ఇక వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అటు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లగా అక్కడ కూడా ప్రతి మ్యాచ్ కు వర్షం ఇబ్బంది కలిగిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న జరిగిన టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణం  గా పూర్తిగా రద్దు అయిపోయింది. ఇక రెండవ మ్యాచ్ జరిగినప్పటికీ మూడో మ్యాచ్ కూడా చివరికి వర్షం కారణం గా రద్దు కావడం తో డక్ వర్త్ లూయిస్  పద్ధతి ప్రకారం చివరికి మ్యాచ్ ఫలితాలు టై గా ప్రకటించారు అన్న విషయం తెలిసిందే.


 ఇక వన్డే వరల్డ్ కప్ కూడా అటు వర్షం ప్రభావం కొనసాగుతుంది అని చెప్పాలి. మొదటి వన్డే మ్యాచ్ జరిగినప్పటికీ రెండో వన్డే మ్యాచ్లో చివరికి వర్షం కారణం గా మ్యాచ్ రద్దయింది. అయితే ఇక ఇటీవల ఇదే విషయం పై స్పందించిన భారత యువ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో రూఫ్ లు ఉన్న ముడుచుకు పోగల  స్టేడియాలు బెస్ట్ ఆప్షన్ అంటూ శుభమన్ గిల్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఇక తుది నిర్ణయం మాత్రం క్రికెట్ బోర్డులు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: