గత కొంతకాలం నుంచి టీమిండియా ప్రయోగాలకు అడ్డాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత జట్టులో ఎవరు ఉంటారు. ఎవరిని పక్కకు పెడతారు అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టు ఆడుతున్న ప్రతి మ్యాచ్లో కూడా ఎవరు తుది జట్టులో ఉంటారు అన్న విషయంపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు టీమిండియా అభిమానులు. ఎందుకంటే జట్టులో ఆటగాళ్ళను తరచూ మారుస్తూనే ఉన్నారు సెలక్టర్లు.


 కొన్ని కొన్ని సార్లు కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం విశ్రాంతి ప్రకటించి యువ ఆటగాళ్లకు సారధ్య బాధ్యతలను అప్పగిస్తూ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో జరుగుతున్న మార్పులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు టీమిండియా జట్టు సెమి ఫైనల్ ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే వరల్డ్ కప్ లో టీమిండియా వైఫల్యానికి అంతకుముందు చేసిన వరుస ప్రయోగాలే కారణం అంటూ ఎంతోమంది తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియాలో ప్రయోగాలకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ప్రయోగాల పేరుతో కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో సీనియర్లకు నిర్లక్ష్యం చేయడం తగదు అంటూ వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టులోని ఆటగాళ్ల సగటు వయసు 31 సంవత్సరాలు అని గుర్తు చేశాడు. టీమిండియాను బౌలింగ్ సమస్య వేధిస్తుందని.. ఇప్పటినుంచి వచ్చే ఏడాది వరల్డ్ కప్ కోసం సన్నద్ధం కావాలని సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: