గత కొంతకాలం నుంచి రెండు మెగా టోర్నీల విషయంలో ప్రపంచ క్రికెట్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఏకంగా వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరుగుతూ ఉండగా.. భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీలలో ఈ రెండు జట్లు ఎలా పాల్గొనబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే పాకిస్తాన్లో కాకుండా తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహిస్తేనే తాము ఆసియా కప్ లో ఆడతాము అంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది.


 ఇలాంటి సమయంలో ఇక బీసీసీఐ తీసుకునే నిర్ణయం పై అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఒకవేళ ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టకపోతే.. ఇక తాము కూడా వన్డే వరల్డ్ కప్ నుంచి పక్కకు తప్పుకుంటామని భారత్ వెల్లబోము అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమిజ్ రాజా కూడా చెప్పడం ఆసక్తికరంగా మారిపోయింది. దీంతో రానున్న రోజుల్లో ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి అన్న విషయం పైన చర్చ జరుగుతుంది.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానీష్ కనేరియా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆసియా కప్కు టీమిండియా పాకిస్తాన్ కు రాకపోతే తాము కూడా ఇండియాలో జరిగే వన్ డే వరల్డ్ కప్ కు రాము అంటూ పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకించాడు. ఐసీసీ ఈవెంట్ ను బాయికాట్ చేసేంత దమ్ము పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు లేదు అంటూ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ రాకపోయినా ఇండియా లెక్క చేయదు. ఎందుకంటే ఇండియాలో క్రికెట్కు ఉన్న భారీ ఫాలోయింగ్ వల్ల ఎంతో ఆదాయం వస్తుంది. ఒకవేళ వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ ఇండియాకు వెళ్ళకపోతే అది పాకిస్తాన్ క్రికెట్ మీదే ఎంతో ప్రభావం పడుతుంది అంటూ  కనేరియా వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc