ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ వచ్చిన అడపాదడపా అవకాశాలలో బాగా రాణిస్తూ ఉన్నప్పటికీ సంజు శాంసన్ కు మాత్రం అన్యాయం జరుగుతుంది అని గత కొంత కాలం నుంచి తీవ్రమైన చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఫామ్ లో లేని వాళ్లకు వరుసగా చాన్సులు ఇస్తున్న టీమ్ ఇండియా జట్టు యాజమాన్యం అటు సంజు శాంసన్ విషయం లో మాత్రం వివక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుంది అని అభిమానులు అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



 ఏకంగా జట్టు లో పేలవ మైన ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లు ఎంతో  మంది ఉన్నప్పటికీ సంజు శాంసన్ ను మాత్రమే ఎందుకు జట్టు నుంచి తప్పిస్తున్నారు అంటూ గత కొంత కాలం నుంచి సోషల్ మీడియా వేదికగా అటు బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి.. ఇక అభిమానులు ఎంత మొత్తుకున్నా ఈ విషయం పై స్పందించే వారే కరువయ్యారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇదే విషయం పై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 భారత తుది జట్టు నుంచి ఎవరినైనా తప్పించాల్సి వస్తే మొదటగా వచ్చే పేరు సంజు శాంసన్ దే అంటూ చెప్పుకొచ్చాడు వసీం జాఫర్. నిజం గా ఇది ఎంతో బాధాకరం. తనను జట్టు నుంచి ఎందుకు తప్పిస్తున్నారు కూడా తెలుసుకోలేని దీన స్థితిలో సంజు శాంసన్ ఉన్నాడు అంటూ సానుభూతి వ్యక్తం చేశాడు. సంజు శాంసన్ అద్భుతమైన ప్లేయర్ అని మేనేజ్మెంట్ కి కూడా తెలుసు. కానీ సరైన అవకాశాలు ఇవ్వకుండా అతని కెరియర్ను నాశనం చేస్తుంది అంటూ మండి పడ్డాడు. సంజు శాంసన్ ను ఇంత చిన్నచూపు చూసే యాజమాన్యం అటు రిషబ్ పంతుకు మాత్రం ఎందుకు ప్రోత్సాహిస్తుందో అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: