విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం ఎంతో మంది అద్భుతంగా రాణిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెంచరీలతో చెలరేగిపోతూ తమ జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల విజయ్ హాజరే ట్రోఫీలో భాగంగా జమ్మూ కాశ్మీర్తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో అస్సాం జట్టు విజయం సాధించి సెమీఫైనల్ అడుగుపెట్టింది. అయితే అస్సాం జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ 116 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్లతో  174 పరుగులు చేసి చెలరేగిపోయాడు. ఇక విధ్వంసకర బ్యాటింగ్ తో ఏకంగా జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అస్సాం జట్టు ఏకంగా ఊహకందని విధంగా సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. దీంతో ఇక ఆ జట్టు అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా జమ్మూ కాశ్మీర్ పై అస్సాం జట్టు విజయం సాధించిన అనంతరం రియాన్ పరాగ్ ఏకంగా ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అస్సాం జట్టును ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు అంటూ ట్విట్ చేశాడు. అయితే ఇది దినేష్ కార్తీక్ ను ఉద్దేశించి చేశాడు అని నెటిజన్లు అంటున్నారు.



 ఎందుకంటే సరిగ్గా వారం రోజుల క్రితం విజయ్ హాజరే  ట్రోఫీ నిర్వహణపై దినేష్ కార్తీక్ స్పందించాడు. ట్రోఫీ నిర్వాహన తల తోక లేకుండా ఉందని విమర్శించాడు. తమిళనాడు వంటి అలైట్ హోదా ఉన్న జట్టుతో అనామిక అరుణాచల్ ప్రదేశ్ ఆడటం ఏంటని... అసలు ఎలైట్ లిస్టులో ఉన్న జట్లలో ఈశాన్య రాష్ట్రాల క్రికెట్ జట్లు లీగ్ దశలో పోటీ పడటంలో ఏమైనా సెన్స్ ఉందా.. ఇది ఎలైట్ జట్ల రన్ రేట్ మార్చి వేస్తుంది. ఒకవేళ వర్షం వచ్చి మ్యాచ్ కు అంతం కలిగిస్తే పరిస్థితి ఏంటి.. ఎలైట్ గ్రూప్లో లేని జట్లను సపరేట్ గ్రూప్గా చేసి వాటితో క్వాలిఫైయర్ ఆడించలేరా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం సెమీఫైనల్ చేరడంతో ఇక గట్టిగా చెప్పండి ఇది అస్సాం ను తక్కువ అంచనా వేయొద్దు అంటూ రియాన్ పరాగ్ పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk