సాధారణంగా తమ అభిమాన ఆటగాళ్లను కలవాలని ఎప్పుడూ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ అలాంటి ఛాన్స్ వచ్చింది అంటే ఇక ఎంతగానో సంతోష పడిపోతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అభిమానులు ఏకంగా సెల్ఫీల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలా అభిమానుల అత్యుత్సాహం ఆటగాళ్లను తీవ్ర ఇబ్బందికు గురి చేస్తూ ఉంటుంది. కేవలం ఆటగాళ్లను మాత్రమే కాదు పక్కన ఉన్న వాళ్ళని సైతం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కథార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.


 ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ హెచ్ లో ఇటీవలే ఘన  దక్షిణ కొరియాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా ఘాణా జట్టు 3-2 తేడాతో సౌత్ కొరియా పై ఉత్కంఠమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అయితే మహమ్మద్ కుదూస్ రెండు గోల్స్ కొట్టి ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. మరోవైపు మాత్రం సౌత్ కొరియా ఓటమితో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసక్తికర ఘటన జరిగింది. ఓడిపోయామన్న బాధలో సౌత్ కొరియా జట్టు కెప్టెన్ సన్ హ్యూంగ్ మిన్ ఏడుస్తూ తెగ ఫీల్ అయ్యాడు.


 ఇలాంటి సమయంలోనే పక్కన ఉన్న సహచర ఆటగాళ్లు అతన్ని ఎంతగానో ఓదార్చారు అని చెప్పాలి. ఇక ఇలా సౌత్ కొరియా జట్టు కెప్టెన్ ఏడుస్తున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఏడుస్తున్న ఆటగాడిని ఓదార్చాల్సింది పోయి ఘన స్టాఫ్ సిబ్బంది తమ చేష్టలతో విసుకు పుట్టించారు. ఏకంగా ఒకపక్క అతను కన్నీరు పెట్టుకుంటుంటే.. మరోవైపు మాత్రం అక్కడ ఉన్న సిబ్బంది అతనితో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించడం  కెమెరాలలో రికార్డు అయింది. ఇక ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది. దీంతో అతను ఏడుస్తుంటే సెల్ఫీ తీసుకోవడానికి కాస్తైన సిగ్గుండాలి అంటూ క్రీడాభిమణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: