గత కొంతకాలం నుంచి టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇదే విషయంపై బీసీసీఐ పై  తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. వరుసగా అవకాశాలు ఇస్తున్న.. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక విఫలమవుతున్న రిషబ్ పంతుకు తుదిజట్టులో చోటు కల్పిస్తున్నారు. ఇక సంజూ శాంసన్ బాగా రాణిస్తున్న అతన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.

 ఇలా రిషబ్ పంతుకు మద్దతు పలుకుతూ సంజూ శాంసన్ పై వివక్ష చూపడం ఏమాత్రం సరికాదు అంటూ ఎంతో మంది అభిమానులు బీసీసీఐపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రిషబ్ పంతును జట్టు నుంచి తప్పించి సంజూ శాంసన్ ను జట్టు లోకి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఇదే విషయం పై న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజు శాంసన్ జట్టులో స్థానం కోసం ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.



 కెప్టెన్గా కొన్ని కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను సరైన జట్టును ఎంపిక చేసుకోవడం లో తడబడును. సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే కొన్నిసార్లు అవకాశాల కోసం ఓపికగా ఎదురు చూడాల్సి ఉంటుంది. రిషబ్ పంత్ నైపుణ్యం గల ఆటగాడు. మ్యాచ్ విన్నర్ కూడా . కష్టకాలం లో అతనికి అండగా నిలవాల్సి ఉంటుంది అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు  ఇలా ఒక రకంగా సంజూ శాంసన్ కి బదులు రిషబ్ పంత్ కు వరుసగా తుది జట్టులో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని శిఖర్ ధావన్ సమర్ధించుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: