సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి గుర్తింపు సంపాదించుకుంటే ఎలాంటి లగ్జరీ లైఫ్ ని గడపొచ్చో ఎంతలా సంపాదించవచ్చు అన్నదానికి నిదర్శనంగా నిలిచే క్రికెటర్లు ప్రపంచ క్రికెట్లో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు అని చెప్పాలి. అలాంటి క్రికెటర్లలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి వరుసలో ఉంటాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ క్రికెట్లో ఎంతో కాస్లీ క్రికెటర్ అని చెప్పాలి. ఎందుకంటే అతను క్రికెట్ ఆడటం ద్వారా మాత్రమే కాకుండా వాణిజ్య ప్రకటనలు ద్వారా కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. మరోవైపు ఇక సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కూడా కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ ఉంటాడు అని చెప్పాలి.
 ఇక క్రికెట్లో ఎంతలా తన హవా నడిపిస్తూ ఉంటాడో డబ్బులు సంపాదించడంలో కూడా అంతే వేగంగా దూసుకుపోతూ ఉంటాడు విరాట్ కోహ్లీ   ఇకపోతే ఇటీవల టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అలీ బాగ్ లో ఖరీదైన విల్లాను కొనుగోలు చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వైరల్ గా మారిపోయింది. ఏకంగా 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో ఫామ్ హౌస్  నిర్మించుకున్నట్లు గతంలోని వార్తలు కూడా వచ్చాయి. 19 కోట్ల విలువైన ఈ లగ్జరీ విల్లా కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.


 బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా అలీబాగ్ కంపెనీ ఇక కోహ్లీ విల్లాకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది చూసి అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. కాగా సెలబ్రిటీ డిజైనర్ అయిన సుసానే ఖాన్ ఇక ఈ విల్లాకు ఇంటీరియర్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ అద్భుతమైన ఇంటీరియర్ తో ఉన్న విల్లా ను  చూసి వావ్ మీ ఇల్లు ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు అభిమానులు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: