మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్టు చివరికి విశ్వవిజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత అదే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వన్డే సిరీస్ లో మాత్రం పేలవ మైన ప్రదర్శన చేసి తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది. అయితే మొన్నటికి మొన్న నిరాశపరిచిన ఇంగ్లాండ్ జట్టు ఇక ఇప్పుడు పాకిస్తాన్ గడ్డపై మాత్రం అదరగొడుతుంది అని చెప్పాలి.


 దాదాపు దశాబ్ద కాలం తర్వాత అటు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండు జట్టు ఇక అక్కడ ఆతిధ్య పాకిస్తాన్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా టెస్ట్ తొలి సెషన్ లోనే అదరగొట్టింది. ఏకంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు అటాకింగ్ గేమ్ ఆడుతూ టి20 తరహాలో చెలరేగిపోయారు అని చెప్పాలి. ఇక వాళ్లు బ్యాటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆడుతున్నది టెస్ట్ ఫార్మాట్ అన్న విషయం మరిచిపోయినట్లున్నారు అని ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిలో ఒక ఆలోచన మెదిలింది అంటే వారి విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పాలి. ఇలా ఇంగ్లాండ్ జట్టు తొలి సెషన్ లోనే ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించింది.



 ఇలాంటి సమయంలోనే ఇంగ్లాండ్ బ్యాటర్ బ్రూక్స్.. ఏకంగా ఆరుదైన ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు అని చెప్పాలి.  ఓకే ఓవర్ లో వరుసగా ఆరు బంతులలో ఆరు ఫోర్లు బాది అదరగొట్టాడు. సౌద్ షకిల్ వేసిన 68వ ఓవర్ లో వరుసగా 6 ఫోర్లు కొట్టాడు బ్రూక్స్. అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న బ్రూక్స్ ఇక అతని బౌలింగ్లో చెడుగుడు ఆడేశాడు అని చెప్పాలి. అది కూడా టెస్ట్ ఫార్మాట్లో ఈ స్థాయి విధ్వంసం సృష్టించడంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు.  అంతేకాదు ఇక ఇంగ్లాండ్ జట్టు తరుపున క్రాలే 122, డకేన్ 107, ఫోప్ 108 పరుగులతో అదరగొట్టారు. బ్రూక్స్ 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: