బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. ధోని కెప్టెన్సీలో ఇప్పటివరకు ఏకంగా నాలుగు సార్లు టైటిల్ అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది అని చెప్పాలి. అంతేకాదు మిగతా జట్లతో పోల్చి చూస్తే ఎక్కువ సార్లు ఫైనల్ చేరిన జట్టుగా కూడా చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే ఇలా ఇప్పటివరకు అద్భుతమైన గణాంకాలు కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది సీజన్లో మాత్రం పేలవమైన ప్రదర్శన చేసింది.


 దీంతో ఏకంగా జట్టును మరింత పటిష్టవంతంగా మార్చుకునేందుకు పలువురు ఆటగాళ్లను వదిలేస్తూ ఇటీవలే చెన్నై జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సిఎస్కే జట్టులోకి రాబోయే కొత్త ఆటగాళ్ళు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి ప్రస్తుతం ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్రేక్షకులు ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకున్నాయ్. ఏకంగా వెస్టిండీస్ ఆల్ రౌండర్ బ్రావో ఐపిఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపి అభిమానులకు షాక్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున సేవలు అందించిన  బ్రావోను వదులుకునేందుకు సిద్ధపడని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా అతన్ని బౌలింగ్ కోచ్ గా కూడా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గత కొన్నేళ్ల నుంచి  బ్రావో చెన్నై తరపున ఆడి ఎన్నో విజయాలు అందించాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పుడు వరకు 183 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా కూడా ఉన్నాడు. మరోవైపు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ పోలార్డు సైతం ఐపీఎల్ నుంచి తప్పుకుని ముంబై బ్యాటింగ్ కోచ్గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk