గత కొంతకాలం నుంచి భారత ఓపెనింగ్ జోడి పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే . ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ రెగ్యులర్ ఓపెనర్లుగా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఇక ఇద్దరు ఓపెనర్లు కూడా ఎందుకో.. ఆశించిన స్థాయిలో మాత్రం ప్రదర్శన చేయలేకపోతున్నారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇక వీరు కాకుండా ఎవరు అయితే ఓపెనింగ్ జోడిగా బాగుంటుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తూ ఉన్నారు.


 ఇక మరోవైపు అటు వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్ ఇక ఓపెనర్ గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి జోడి ఇప్పటివరకు టీమిండియా కు ఎన్నోసార్లు విజయాలు అందించినప్పటికీ ఇటీవల కాలంలో వీరిద్దరి ఓపెనింగ్ జోడి మాత్రం పెద్దగా సక్సెస్ కాలేక పోతుంది. దీంతో కొత్త ఓపెనింగ్ జోడి పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు అని చెప్పాలి. అంతేకాకుండా ఇక వీరిద్దరిలో  ఎవరైనా గాయపడితే ప్రత్యామ్నాయ ఓపెనర్ ఎవరు అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సభా కరీం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కు కేఎల్ రాహుల్ ప్రత్యామ్నాయం అంటూ అభిప్రాయపడ్డాడు. కాగా కేఎల్ రాహుల్ బాగా ఆడాడు. ఫామ్ సమస్య కాదు. కానీ ఏ స్థానంలో బ్యాటింగ్ దిగుతాడో తెలియదు. మిడిల్ ఆర్డర్లో ఆడిస్తున్న ఆస్థానానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం జట్టులో నెలకొన్న సందిగ్ధత  ఇదే. కెప్టెన్,, మేనేజ్మెంట్ కలిసి వీలైనంత త్వరగా ఇక ఓపెనింగ్ జోడి విషయంలో ఒక పరిష్కారం వెతికితే బాగుంటుంది అంటూ సభా కరీం వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: