ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు ఇక అక్కడ వన్డే సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక వన్డే సిరీస్ లో భాగంగా ఇటీవల జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో గెలుస్తుంది అనుకున్న టీమ్ ఇండియా జట్టు ఓటమిపాలు అయింది. తద్వారా బంగ్లాదేశ్ గడ్డపై వరసగా సిరీస్ లకు సిద్ధమవుతున్న టీమ్ ఇండియాకు మొదటి అడుగులోని చేదు అనుభవం ఎదురయింది. అయితే బంగ్లాదేశ్ జట్టు గెలవడానికి టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏదైనా ఉంది అంటే అది టీమిండియా పేలవమైన ఫీల్డింగ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 పరిస్థితులు మొత్తం భారత జట్టు వైపు అనుకూలిస్తున్న సమయంలో భారత ఆటగాళ్ల పేలవమైన ఫీల్డింగ్.. క్యాచ్ లను వదిలేయడం కారణంగా.. చివరికి బంగ్లాదేశ్ జట్టు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని గెలుపు వైపుగా దూసుకుపోయింది. ఇక క్యాచేస్ విన్స్ మ్యాచెస్ అన్న విషయం మరోసారి నిజం అయింది  అన్న విషయం తెలిసిందే. టీమిండియా  నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్న బంగ్లాదేశ్ జట్టు మెహది హసన్ చేసిన 38 పరుగుల సాయంతో విజయం సాధించగలిగింది.


 అయితే 42.3 ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 32 పరుగులు కావాలి టీమిండియా అప్పటికే ఒక క్యాచ్ జార విడిచింది.  ఇక ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ సైతం క్యాచ్ ను పట్టుకునేందుకు కనీస ప్రయత్నం చేయకపోవడంతో  కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇప్పటికీ ఫీల్డింగ్ వైఫల్యాలు
 కారణంగా పలు బౌండరీలు వదిలేసాడు వాషింగ్టన్ సుందర్. ఇక ఆ తర్వాత ఏకంగా ఎంతో సులభమైన క్యాచ్ ని కూడా పట్టుకునేందుకు వాషింగ్టన్ సుందర్ ప్రయత్నం చేయకపోవడంతో సహనం కోల్పోయిన రోహిత్ బండబూతులతో విరుచుకుపడ్డాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: