ఈ ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి  దిగిన టీమిండియా జట్టు వరుసగా విషయాలు సాధిస్తుంది చెప్పాలి. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తన సారధ్య సామర్థ్యం నిరూపించుకున్న రోహిత్ శర్మ ఇక ఇప్పుడు టీమిండియా కెప్టెన్ గా కూడా అదే రీతిలో ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే టీమిండియా కెప్టెన్గా రోహిత్ సక్సెస్ అవుతున్నప్పటికీ వరుస సిరీస్ లు అందిస్తూ ఉన్నప్పటికీ అదే సమయంలో కొన్ని సిరీస్ లలో అటు టీమిండియా ఓడిపోవడం కూడా జరుగుతూ ఉంది అని చెప్పాలి.


 సరిగ్గా వరల్డ్ కప్ ముందు వరకు కూడా తన కెప్టెన్సీ తో వరుసగా సిరీస్ లను గెలిపించిన రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అంతకుముందు ఆసియా కప్ లో కూడా నిరాశపరిచాడు. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. కెప్టెన్ గా మాత్రమే కాదు ఒక ఆటగాడిగా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఈ ఏడాది అటు టీమ్ ఇండియాకు  ఒక పీడకలగా మారిపోయింది అని ఫ్యాన్స్ అంటున్నారు.

 ఒక్క ఏడాదిలోనే అన్ని ఫార్మాట్లలో కలిపి ఏకంగా ఆరు సిరీస్లలో ఓడిపోయింది టీమిండియా జట్టు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఓడిపోయి ఈ ఏడాది  మొదటి సిరీస్ ఓటమి నమోదు చేసింది అని చెప్పాలి. అదే సమయంలో ఇక సౌత్ ఆఫ్రికా తో జరిగిన వన్డే సిరీస్ ను కూడా కోల్పోయింది టీమిండియా జట్టు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండుతో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో కూడా ఓడిపోయి సిరీస్ చేజార్చుకొని నిరాశపరిచింది. ఆసియా కప్ లో ఫైనల్ కు చేరకుండానే నిష్క్రమించింది. టి20 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ నుంచి వెనుతిరిగింది. ఇక ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: