దాదాపు దశాబ్దాల కాలం తర్వాత దిగజా ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పోటీలలో భాగంగా ప్రస్తుతం ఇక పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది. అయితే మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ విరోచితంగా పోరాడినప్పటికీ అటు ఇంగ్లాండ్ కు మాత్రం ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది పాకిస్తాన్ జట్టు.



 అయితే పాకిస్తాన్లో ఉన్న అరకొర పిచ్ లపై అటు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు టీ20 తరహాలో చెలరేగిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా సెంచరీలతో చెలరేగిపోతూ భారీ స్కోర్ చేశారు.  తద్వారా తమ బ్యాటింగ్ తో ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా క్రియేట్ చేశారు అని చెప్పాలి. ఇకపోతే ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ల దాటికి అటు పాకిస్తాన్ సొంత దేశంలో కూడా గెలవలేకపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్లలో ఓడిపోయి ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయింది పాకిస్తాన్ జట్టు.


 ఈ క్రమంలోనే ఇలా ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన నిరాశలో ఉన్న పాకిస్తాన్ కు మూలుగుతున్న నక్క పై తాటి పండు పడ్డట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ నుంచి కూడా నిష్క్రమించింది అని చెప్పాలి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్ లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. తర్వాత సౌత్ ఆఫ్రికా రెండవ స్థానంలో ఉంది. శ్రీలంక ఇండియా మూడు నాలుగు స్థానాలలో కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో ఓటమి ద్వారా పాకిస్తాన్ ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ నుంచి నిష్క్రమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: