ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉండగా.. ఇక ఇటీవల వన్డే సిరీస్ ను ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ఆడబోతుంది టీమ్ ఇండియా జట్టు. అయితే వన్డే సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి సిరీస్ చేజార్చుకొని తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది టీమిండియా. కానీ మూడవ మ్యాచ్ లో మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధించి చివరికి పరువు నిలబెట్టుకుంది అని చెప్పాలి. అదే ఆత్మవిశ్వాసంతో ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ప్రారంభించడానికి సిద్ధమవుతుంది.


 అయితే మూడో వన్డే మ్యాచ్లో అటు విరాట్ కోహ్లీ తన కెరియర్ లో 72వ సెంచరీ అందుకోగా.. మరోవైపు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఇక తన కెరియర్ లో మొదటి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనిపై ప్రశంసలు కురిపిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు మసీం జాఫర్ ఒకవైపు ఇషాన్ కిషన్ నూ పొగుడుతూనే.. మరో యువ ఓపెన్ అర అయినా శుభమన్ గిల్  పై జాలిపడ్డాడు.  ఇటీవల జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఇషాన్ కిషన్ శుభమన్ గిల్ కన్నా ఉత్తమ ఆటగాడిగా మారిపోయాడు.


 ఇక గిల్ విషయంలో నాకు కాస్త బాధగా ఉంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ముందు వరకు కూడా ఓపెనర్ల లిస్టులో గిల్ ముందు వరుసలో ఉన్నాడు.  రోహిత్ శర్మ శిఖర్ ధావన్ తర్వాత ఓపెనర్ రేసులో ముందుంది గిల్ మాత్రమే. ఇక ఇషాన్ కిషన్ ఇటీవల డబుల్ సెంచరీ చేయడంతో శుభమన్ గిల్ నాలుగోవ స్థానానికి పడిపోయాడు.. అయితే అతడు తప్పేమీ లేకపోయినా.. గిల్ జట్టులో స్థానం దక్కకపోవడం బాధగా అనిపిస్తుంది అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఇక వసీం జాఫర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: