మెకళ్లమ్ ఇంగ్లాండ్  జట్టుకు హెడ్ కోచ్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్ ఫార్మాట్లో ఇక ఆ జట్టు ఆట తీరు పూర్తిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏళ్ళ చరిత్ర కలిగిన టెస్ట్ ఫార్మాట్లో సరికొత్త ట్రెండుకు నాంది పలికింది ఇంగ్లాండ్ జట్టు. ఏకంగానెమ్మదిగా ఆడటం కాదు ఎంతో దూకుడైన ఆట తీరుతో టి20 తరహా అగ్రెసివ్ నెస్ తో ఇక ప్రత్యర్థులపై విరుచుకు పడటం ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటతీరిలో చూడవచ్చు.


 అయితే ఇక ప్రస్తుతం ఇలా ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బజ్ బాల్ విధానం కాస్త అంతర్జాతీయ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో టీంలు సైతం ఇక ఇంగ్లాండ్ బజ్ బాల్ విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పాలి. ఇకపోతే ఇటీవల బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ఆడుతుండగా.. తాము కూడా ఇంగ్లాండు లాగా బజ్ బాల్ విధానాన్ని అనుసరిస్తాం అంటూ కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. కానీ టీమిండియా ఆటగాళ్లు ఎవరూ కూడా దూకుడుగా ఆడలేదు. ఎప్పటిలాగానే నెమ్మదిగా ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టారు అని చెప్పాలి.


 ఇటీవల  ఇదే విషయంపై టీం ఇండియా సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు బజ్ బాల్ స్టైల్ అసలు సూట్ కాదు.. ఎందుకంటే ఉపఖండ పిచ్ లు చాలా స్లోగా ఉంటాయి. స్పిన్నర్లకు అనుకూలిస్తాయ్. ఇలాంటి పిచ్ ల  మీద బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. క్రీజులో  కుదురుకోవడానికి సమయం తీసుకోవాలి. ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినప్పటికీ దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తే చివరికి వికెట్ కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి వికెట్ల మీద భారీ స్కోర్ చేయాలంటే మాత్రం ఎంతో గొప్ప టెక్నిక్ తో పాటు ఓపిక కూడా అంతే కావాలి. క్రీజులో ఎంత ఎక్కువసేపు కుదురుకుంటే.. అంత బాగా పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది. పిచ్ నుంచి సరైన సహకారం లేనప్పుడు ఆడటానికి ప్రయత్నించిన చివరికి ఫలితం ఉండదు అంటూ దినేష్ కార్తీక్ కామెంట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: