ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమ్ ఇండియా జట్టు అదరగొడుతుంది అన్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లో ఓడిపోయినప్పటికీ ఇక కీలకమైన టెస్ట్ సిరీస్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 188 పరుగులు తేడాతో భారత జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. దీంతో 1-0 తేడాతో ఆదిక్యాన్ని సాధించింది భారత జట్టు  ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఇక జట్టులో ఉన్న అందరూ ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన చేసే ఆకట్టుకున్నారు అని చెప్పాలి.


 అయితే గత కొంతకాలం నుంచి పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంతో దూకుడుగా  బ్యాటింగ్ చేశాడు. అయితే బ్యాటింగ్ లో ఆకట్టుకోవడమే కాదు కీపింగ్ ద్వారా కూడా అందరిని దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ నోరూల్ హసన్ ను రిషబ్ పంత్ స్టంప్ అవుట్ చేసిన తీరు అయితే మ్యాచ్ మొత్తానికి హైలెట్గా నిలిచింది. రిషబ్ పంత్ కీపింగ్ ప్రతిభ గురించి అటు భారత జట్టు సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి.


 బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో రిషబ్ పంత్ అద్భుతమైన కీపింగ్ నైపుణ్యాలు ప్రదర్శించాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని రిషబ్ పంత్ ఆరారిస్తాడని భావిస్తున్నా.  మహేంద్ర సింగ్ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ చేసిన స్టంపింగ్ చూసి ఉంటే గర్వంగా ఫీల్ అయి ఉంటాడు. పిచ్ మీద బంతి చాలా వేగంగా కీపర్ వైపు వచ్చింది. అయినప్పటికీ పంత్ అద్భుతంగా ఒడిసి పట్టి స్టంప్ ఔట్ చేశాడు . ధోని కూడా ఇలా అద్భుతమైన స్టంప్ అవుట్ లు చేసేవాడు. బ్యాటర్ ను ముందే అంచనా వేసి వికెట్లను గిరాటేసేందుకు ధోని ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకోవచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: