పాకిస్తాన్‌ క్రికెట్ జట్టుకి సారధ్యం వహించి, విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన పాక్ మాజీ క్రికెటర్‌ మీకు గుర్తున్నాడా? అతనేనండీ ఇంజమామ్. అభిమానులంతా ఆయనని ఇంజి అని పిలుచుకుంటూ వుంటారు. ఆయన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికి దాదాపు 15 ఏళ్లకు పైనే పూర్తవుతోంది. కాగా జింబాబ్వే తో 2007లో జరిగిన వన్డే సిరీస్‌లో భాగం గా పాక్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ ఆడటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం అతగాడు తన సొంత యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిమానులను అలరిస్తున్నాడు.

ఈ క్రమం లోనే తాజాగా.. తన అద్భుతమైన బ్యాటింగ్‌ టచ్ మరో సారి నిరూపించాడు. పాకిస్తాన్‌ లో మెగా స్టార్స్‌ లీగ్‌ పేరిట 6 జట్ల మధ్య T10 లీగ్‌ జరుగుతోన్న సంగతి తెలిసినదే. ఇందులో భాగం గా కరాచీ కింగ్స్‌ తరఫున బరి లోకి దిగిన ఇంజమామ్‌.. కేవలం 16 బంతుల్లో 29 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక్కడ విషయం ఏముందని అనుకుంటున్నారా? ఈ క్రమం లో అతడు కొట్టిన పవర్‌ ఫుల్‌ సిక్సర్‌ చూపరులను అలరించింది. సదరు మ్యాచ్ కే అది హైలైట్‌ అయింది.

52 ఏళ్ల వయసు లో ఇంజీ కొట్టిన షాట్ ని చూస్తూ అలా ఉండి పోయారు అభిమానులు. ఇక డగౌట్‌లో కూర్చున్న మరో మాజీ సారథి షాహిద్‌ ఆఫ్రిది సైతం ఇంజీ భాయ్‌ షాట్‌కు అవాక్కయ్యాడు. ఇక సోమవారం జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ గా కాగా సదరు వీడియో తెగ వైరల్ అవుతోంది. కాగా పాకిస్తాన్‌ తరఫున ఇంజమామ్‌ వన్డేల్లో మొత్తం గా 11,701 పరుగులు సాధించిన సంగతి అందరికీ విదితమే. పాక్‌ తరఫున వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్‌ గా ఇంజీ రికార్డులు నెలకొల్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: