ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత జట్టు చివరికి సెమీఫైనల్ నుంచి ఇంటి బాట పట్టింది అన్న విషయం తెలిసిందే. దీంతో వరల్డ్ కప్ టైటిల్ గెలవాలన్న నిరీక్షణ అటు టీమ్ ఇండియాకు తీరకుండానే పోయింది. ఈ క్రమంలోని టీమిండియా పేలవమైన ప్రదర్శన పై తీవ్ర స్థాయిల విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమయంలోనే అటు జట్టులో ప్రక్షాళన మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ముగిసిన నాటి నుంచి కూడా జట్టులో ఉన్న సీనియర్లపై వేటుపడే అవకాశం ఉంది అన్న ప్రచారం మొదలైంది.


 బీసీసీఐ సేలెక్టర్లు టీమిండియా జట్టును యువ ఆటగాళ్లతో నింపేసే అవకాశం ఉందని అందరూ భావించారు.  ఇక అనుకున్నట్లుగానే బీసీసీఐ పెద్దలు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు అని చెప్పాలి. ఇక జట్టులో సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారిని కేవలం ఏదో ఒక ఫార్మాట్కు మాత్రమే పరిమితం చేసి ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఎక్కువగా యువ ఆటగాళ్లు ఉండేలా చూసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ టి20 ఫార్మాట్ కు పూర్తిగా దూరమైపోయాడు. కేవలం వన్డే ఫార్మర్లలో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు.


 ఇకపోతే ఇటీవలే వన్డే ఫార్మాట్ ఎంపికలో కూడా శిఖర్ ధావన్ ను సెలక్టర్లు పట్టించుకోలేదు అన్నది తెలుస్తుంది. ఇటీవల శ్రీలంక న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్ లకు కేవలం యువ ఆటగాళ్ళకే పెద్ద పీటవేశారు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్లో శిఖర్ ధావన్ రానించకపోవడంతో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు సెలెక్టర్లు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడిగా కేఎల్ రాహుల్ శుభమన్ గిల్ ఉండడంతో శిఖర్ ధావన్ ను పక్కన పెట్టేశారు. దీంతో ఇక రానన్న రోజుల్లో శిఖర్ ధావన్ మళ్ళీ జట్టులోకి రావడం కష్టతరమైన విషయమే అంటూ ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: