సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు కొన్ని కొన్ని సార్లు తమ జట్టును గెలిపించేందుకు చూపించే తెగువ క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఏకంగా ఒకవైపు గాయం అయి రక్తం కారుతున్నప్పటికీ మరోవైపు జట్టు విజయం కోసం పోరాటం కొనసాగించడానికి ఎక్కువగా ఆసక్తికరపరుస్తూ ఉంటారు ఎంతోమంది ఆటగాళ్లు. అయితే ఒకప్పుడు ఇలాంటివి కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించేవి అని భావించేవారు క్రికెట్ ప్రేక్షకులు. కానీ ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఎంతోమంది ప్లేయర్లు ఇలాంటి తెగవ చూపించి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు.


 ఒకవైపు గాయం నొప్పి వేధిస్తున్నప్పటికీ జట్టును ఎలాగైనా గెలిపించాలని కసితో ఆడుతూ ప్రేక్షకులు మనసులు కొల్లగొట్టిన ఆటగాళ్లు ఎంతోమంది ఉండగా.. ఇక ఇప్పుడు ఆ లిస్టులో ఆస్ట్రేలియా ఫేస్ గన్ మిచెల్ స్టార్క్  కూడా చేరిపోయాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా తో టెస్టు సిరీస్ ఆడుతుంది ఆసీస్ జట్టు. ఈ క్రమంలోనే స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకుని అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఒకవైపు చేతికి గాయమై రక్తం కారుతున్నప్పటికీ జట్టు విజయం కోసం బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా స్టార్ బోల్ స్టార్క్ అందరి మనసులు గెలుచుకున్నాడు.



 ఇటీవల మెల్బోర్న్ లో సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా క్యాచ్ అందుకునే క్రమంలో స్టార్క్ ఎడమచేతి మధ్య వేలికి గాయం అయింది అని చెప్పాలి. అయితే గాయం అయ్యి ఆ వేల నుంచి రక్తం కూడా కారడం మొదలైంది. అయినప్పటికీ స్టార్క్ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. ఏకంగా జట్టును గెలిపించడం కోసం బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. జట్టులో కీలక బౌలర్ అయిన తాను ఒకవేళ గాయం కారణంగా మైదానం వీడితే పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న విషయాన్ని ముందుగానే గ్రహించి ఇక మైదానం వదలడానికి ఆసక్తి కనపరచలేదు. దీంతో ఇక జట్టు కోసం అతడు పోరాట పటిమ కనబరిచిన తీరుపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: