సాదరణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరింతంగా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఫన్నీ సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా ప్రత్యర్థులుగా ఉన్నవారు ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి నేటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అంతేకాదు ఇక క్రికెటర్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు మీమర్స్ కి ఫుల్ మీల్స్ లా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి తరహా ఫోటో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది.


 ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు ఆతిథ్య ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయి. అయితే ఈ రెండు మ్యాచ్లలో కూడా ఆతిథ్య ఆస్ట్రేలియా విజయం సాధించడంతో ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా జట్టు సిరీస్ కోల్పోయింది అని చెప్పాలి. అయితే క్రికెట్ మ్యాచ్ లో గెలుపు ఓటముల గురించి పక్కన పెడితే ఇక ఇప్పుడు ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా నేటిజన్స్ అందరూ కూడా తెగ నవ్వుకునేలా చేస్తూ ఉంది అని చెప్పాలి.


 సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ భావమా, మార్కో జాన్సన్లు క్రీజులో ఒక్కరికి ఎదురుగా ఒకరు నిలబడి ఉన్నారు. అయితే సాధారణంగా బావుమా చాలా పొట్టిగా ఉంటాడు. ఇక మార్కో జాన్సన్ ఏమో ఆరున్నర అడుగుల పొడవు ఉంటాడు అని చెప్పాలి. అయితే వైరల్ గా మారిపోయిన ఫోటోలో భావుమా ఏకంగా మార్కో జాన్సన్ వైపు అదోరకమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తూ ఒక లుక్ ఇచ్చాడు. వీడేంటి ఇంత పొడుగున్నాడు అని బ్రహ్మానందం డైలాగుని మనసులో అనుకుంటున్నాడేమో అన్న విధంగానే ఈ ఫోటో ఉంది అని చెప్పాలి. ఇక ఇది చూసి ఎంతో మంది ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: