ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది సౌత్ ఆఫ్రికా జట్టు.. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇటీవల సౌత్ ఆఫ్రికా కు చేదు అనుభవం ఎదురైంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించాలని ఎంతలా ప్రయత్నించినప్పటికీ అది జరగలేదు. దీంతో వరుసగా రెండు టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది ఆస్ట్రేలియా. తద్వారా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అటు సౌత్ ఆఫ్రికా పర్యటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక కనీసం నామమాత్రమైన మూడవ టెస్ట్ మ్యాచ్లో అయినా విజయం సాధించాలని సౌత్ ఆఫ్రికా భావిస్తోంది. ఇక మూడవ మ్యాచ్ లో గెలిచి కాస్త పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. అయితే ఇలా మూడవ మ్యాచ్లో గెలవాలనుకుంటున్న సౌత్ ఆఫ్రికాకు ఊహించిన షాక్ తగిలింది అని చెప్పాలి. ఆస్ట్రేలియా తో జరిగే మూడో టెస్ట్ కు సౌత్ ఆఫ్రికా బ్యాటర్ బ్రూయిన్ దూరం కాబోతున్నాడు.


 ఇటీవల బ్రూయిన్ మొదటిసారి తండ్రి కానున్న నేపథంలో ఇక బిడ్డను చూసుకునేందుకు స్వదేశానికి తిరిగి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక లీవ్ లో స్వదేశానికి వెళ్తున్న బ్రూయిన్ ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ కి అందుబాటులో ఉండడు అని చెప్పాలి. ఇకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ లో భాగంగా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉండగా ఇక వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో ఈ ఫైనల్ రేసులో మరింత వెనుకబడిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: