ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో భాగంగా ఇటీవల సౌత్ ఆఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టు పూర్తి ఆధిపత్యాన్ని కనపరిచి వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి టెస్టు సీరిస్ ను కైవసం చేసుకుంది. ఇకపోతే రెండవ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా అటు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ఎంతో అద్భుతంగా పోరాడిన తీరు అందరి ప్రేక్షకుల మనసు దోచేసింది అని చెప్పాలి.



 రెండో టెస్ట్ సందర్భంగా ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. నోర్జె వేసిన వేగవంతమైన బంతి గ్రీన్ చేతి వెలికి ఎంతో బలంగా తగిలింది. బుల్లెట్ వేగంతో దూసుకు వచ్చిన బంతి గ్రీన్ చేతి వేలిని చీల్చడంతో రక్తం కూడా కారింది అన్న విషయం తెలిసిందే. దీంతో అప్పటివరకు మంచి బ్యాటింగ్ తో అలరించిన కామరూన్ గ్రీన్ రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగి ఇక మైదానాన్ని వీడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపోతే ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులో ఉన్న వైద్య బృందం కామెరాన్ గ్రీన్ కి ఎక్స్ రిపోర్ట్ తీసి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు.


 ఇక ఇందుకు సంబంధించిన విషయాలు బయటకు రావడంతో ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి. వాస్తవానికి నోర్జె వేసిన బంతి వేగానికి గ్రీన్ వేలు విరిగినట్లు ఇటీవల ఎక్స్రే రిపోర్టులో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే లంచ్ కి ముందు మూడు వికెట్ల నష్టానికి 363 పరుగులతో ఎంతో పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. లియోన్ వెనుతిరుగగానే క్రీజులోకి వచ్చాడు కామెరున్ గ్రీన్. అయితే 20 బంతులు ఎదుర్కొన్న తర్వాత నోర్జె వేసిన బంతి ఎదుర్కొనే క్రమంలో చివరికి వేలికి గాయం కాగా ఒకవైపు నొప్పి బాధిస్తున్నప్పటికీ నాలుగు గంటల పాటు ఎంతో ఓపికగా క్రీజులో బ్యాటింగ్ చేశాడు అని చెప్పాలి. 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గ్రీన్ 177 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇలా ఈ వేలు విరిగినప్పటికీ దేశం కోసం అతను పోరాడిన తీరు మాత్రం ప్రేక్షకుల మనసు దోచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: