గత కొంత కాలం నుంచి టీమ్ ఇండియాను గాయాలు బెడద ఎంత తీవ్రంగా వేధిస్తుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు  జట్టు లో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న అందరూ కూడా గాయం కారణంగా చివరికి దూరం అయిపోతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఈ క్రమం లోనే అటు జట్టు లో కీలక బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా సైతం ఎన్నో రోజుల క్రితం అటు  వెన్నునొప్పి సర్జరీ కారణంగా ఇక కీలకమైన టోర్నీల ఆడ లేక పోయాడు అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ టి20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో బుమ్రా అందుబాటులో లేకపోవడం తో ఇక టీమ్ ఇండియాలో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది.


 అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు జట్టులోకి ఎంతమంది బౌలర్లను తీసుకున్నప్పటికీ ఎవరు కూడా బుమ్రా రీతిలో ఇక టీమిండియా కు విజయాలను అందించడంలో కీలకపాత్ర వహించలేకపోయారు అని చెప్పాలి. అయితే ఇక బుమ్రా వెన్నునొప్పి సర్జరీ నుంచి కోలుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతని పునరాగమనం ఎప్పుడూ ఉంటుందా అని అభిమానులు కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో బుమ్రా మళ్లీ మైదానంలోకి దిగి ప్రేక్షకులను అలరించబోతున్నాడు అన్నది తెలుస్తుంది.


 హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోని యువ భారత జట్టు భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో టి20 సిరీస్ ఆడుతుంది. అయితే టి20 సిరీస్ ముగిసిన వెంటనే అటు వన్డే సిరీస్ ఆడబోతుంది భారత జట్టు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ టీమిండియాకు నేతృత్వం వహించబోతున్నాడు అని చెప్పాలి. ఇందులో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రాకు చోటు దక్కింది అని చెప్పాలి. బుమ్రా మళ్ళీ జట్టులోకి వచ్చి మైదానంలో తన మెరుపు బౌలింగ్ తో అలరించబోతున్నాడు అని తెలిసి అభిమానులు అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: