క్రీడా ప్రపంచంలో ఎక్కువగా ఆదరణ కలిగిన ఆటలు కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయి అని చెప్పాలి. ఆ కొన్ని ఆటల్లో క్రికెట్ కి కూడా స్థానం దక్కింది అని చెప్పాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు క్రికెట్ ఆడుతూ ఉండగా.. కోట్ల మంది అభిమానులు క్రికెట్ ను అమితంగా ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ముఖ్యంగా భారత్ లాంటి దేశంలో అయితే క్రికెటర్లను ఏకంగా దేవుళ్ళ లాగా ఆరాధిస్తూ ఉంటారు అభిమానులు. అందుకే క్రికెటర్లకు విగ్రహాలు ఉండడం కూడా చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఎంతోమంది దిగజ క్రికెటర్లకు సంబంధించిన విగ్రహాలుఏర్పాటు చేశారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇప్పుడు వరకు మెన్స్ క్రికెట్ కు సంబంధించిన లెజెండ్రీ క్రికెటర్ల విగ్రహాలు మాత్రమే ఉండడం చూశాము. కానీ లేడి క్రికెటర్ కు సంబంధించిన విగ్రహాలు కూడా ఉంటాయా అంటే మొన్నటి వరకు అసలు ప్రపంచ క్రికెట్లో మహిళా క్రికెట్కు ఎక్కడ గుర్తింపు లేదు అని చెప్పాలి. పురుష క్రికెటర్లను దేవుళ్ళ లాగా ఆరాధించే అభిమానులు మహిళా క్రికెటర్లు మ్యాచ్ ఆడుతుంటే మాత్రం చూడ్డానికి కూడా ఇష్టపడరూ. ఇప్పుడిప్పుడే మహిళ క్రికెట్ కి విశేషమైన ఆదరణ పెరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మహిళా క్రికెట్ ను మరింత ప్రోత్సాహించే విధంగా ఒక అరుదైన ఘటన జరిగింది అని చెప్పాలి. మొట్టమొదటిసారి ఏకంగా మహిళా క్రికెటర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమయ్యారు.


 ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ విగ్రహాన్ని ప్రతిష్టించింది క్రికెట్ ఆస్ట్రేలియా. కెప్టెన్ గా ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్ టైటిల్స్ అందించిన బెలిండా క్లార్క్ విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరిస్తున్నట్లు తెలపడంతో క్రికెట్ అభిమానులందరూ ఆశ్చర్యపోయారు. ఆస్ట్రేలియాలో పర్యటించిన సౌతాఫ్రికా సీడ్నిలో మూడో టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్ సమయంలోనే ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా విగ్రహాన్ని పెట్టడం గమనార్హం. కాగా ఆస్ట్రేలియా తరపున 15 టెస్టులు ఆడిన బెలిండ 100 వన్ డే లు ఆడింది. ఇక వన్డేలలో డబుల్ సెంచరీ బాదిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ గా కూడా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కెప్టెన్ గా రెండు వరల్డ్ కప్ లు అందించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: