టీమిండియా గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఘోర పరాభవాన్ని చవిచూసిన తర్వాత ఇక జట్టులో ప్రక్షాళన అవసరం అంటూ ఎంతో మంది కొత్త డిమాండ్ ను తిరమీదికి తీసుకువచ్చారు అనే విషయం తెలిసిందే. టి20 ఫార్మాట్ అంటే సీనియర్ల క్రికెట్ కాదని కేవలం యువ ఆటగాళ్లను మాత్రమే జట్టులో ఉంచి అందరిపై వేటు వేయాల్సిన సమయం వచ్చేసిందంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జట్టులో సీనియర్ లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మని కూడా కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేశారు.


 కాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా మొదటి ప్రయత్నంలోనే జట్టుకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యాను ఇక టీమిండియా టి20 జట్టుకు కెప్టెన్ గా మారిస్తే బాగుంటుంది అని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు. గత కొంత కొంతకాల నుంచి ఇక ఇలా ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇదే విషయంపై స్పందిస్తూ హార్దిక్ ను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 రోహిత్ శర్మ స్వయంగా తాను టి20 కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకొని.. ఆ బాధ్యతలను పాండ్యాకు అప్పగిస్తే బాగుంటుంది అంటూ అజయ్ జడేజా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ధోని స్వయంగా కోహ్లీకి కెప్టెన్సీ అప్పగించినట్లుగానే ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కూడా పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించాలి అంటూ సూచించాడు.  అయితే రోహిత్ గ్రేట్ కెప్టెన్ అనడానికి ఇప్పుడు వరకు అతను సాధించిన రికార్డులే సాక్ష్యం.. రాజు ఎప్పుడు వేచి ఉండడు.. తనకోసం అందరూ వేచి ఉండేలా చేస్తాడు అంటూ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే మరికొన్ని రోజుల్లో హార్దిక్ పాండ్యాకి టి20 కెప్టెన్సీ అప్పగించబోతున్నారంటూ ప్రచారం కూడా జరుగుతుందన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: