ప్రస్తుతం టీమిండియా జట్టు లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న రోహిత్ శర్మ గత కొంత కాలం నుంచి మాత్రం వరుస వైఫల్యాల తో ఇబ్బందులు పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఓపెనర్ గా బరిలోకి దిగుతూ టీమ్ ఇండియాకు శుభారంబాలు అందించాల్సిన రోహిత్ శర్మ కెప్టెన్ గా మారిన తర్వాత మాత్రం బ్యాట్స్మెన్ గా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఒకవైపు కెప్టెన్ గా తన వ్యూహాలతో జట్టుకు విజయాలను అందిస్తూ ఉన్నప్పటికీ ఒక ఆటగాడిగా మాత్రం అతని ప్రదర్శన ఏమాత్రం స్థాయికి తగ్గట్లుగా  లేదు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతూ ఉండడం పై తీవ్రస్థాయిల విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఇక ఎంతోమంది మాజీ ఆటగాళ్లు సైతం స్పందిస్తూ రోహిత్ శర్మ కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుని మునుపటి ఫామ్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఇక అభిమానులు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇక ఇటీవల  2023 ఏడాదిలో రోహిత్ ఆడిన మొదటి వన్డే మ్యాచ్లో అదరగొట్టాడు. ఈ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 87 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.


 దీంతో రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చినప్పుడే అని అందరూ అనుకున్నారు. కానీ రెండవ మ్యాచ్లో మరోసారి నిరాశ పరిచాడు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్  ఫామ్ గురించి మాజీ క్రికెటర్ గౌతమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ ఒత్తిడి కారణం గానే రోహిత్ ఆశించిన స్థాయి లో ఆడ లేక పోతున్నాడని అభిప్రాయపడ్డాడు. గతం లో రోహిత్ ఆటను నేను ఎన్నోసార్లు మెచ్చుకున్నాను. కానీ టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ ఆటతీరు ఎంతో సాధారణం గా అనిపించింది. కెప్టెన్సీ ఒత్తిడి వల్లే రోహిత్ తడబడుతున్నాడని నా అభిప్రాయం అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: