టీమిండియాలో సక్సెస్ఫుల్ కెప్టెన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పటికే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో తాను కెప్టెన్సీ వహిస్తున్న ముంబై ఇండియన్స్ కి ఏకంగా ఐదు సార్లు టైటిల్ అందించాడు రోహిత్ శర్మ అనిచెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో మరోసారి తన జట్టుకు టైటిల్ అందించేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఇలా తన కెప్టెన్సీ సామర్థ్యం ఏంటో ఐపీఎల్ లో నిరూపించుకొని ఇక విరాట్ కోహ్లీ తర్వాత భారత జట్టు సారధ్య బాధితులను కూడా అందుకున్నాడు అని చెప్పాలి.


 అయితే రోహిత్ శర్మ ఇక టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత తిరుగులేని జట్టుగా మారిపోయిన టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది అని చెప్పాలి. ప్రత్యర్థులను  చిత్తు చేస్తూ అదరగొడుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లినా లేదా స్వదేశంలో  మ్యాచ్లు ఆడిన కూడా టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తూ వరుసగా సిరీస్ లు గెలుచుకుంటూ దూసుకుపోతుంది అని చెప్పాలి. అయితే అటు మెగా టోర్నీ మినహా మిగతా ద్వైపాక్షిక సిరీస్లలో మాత్రం కెప్టెన్గా అటు రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది.


 ఇకపోతే ఇటీవల భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి. స్వదేశంలో వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును కూడా బ్రేక్ చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ మూడు సిక్సర్లు బాదాడు అని చెప్పాలి. పదవ ఓవర్లు రెండు సిక్సర్లు  కొట్టడంతో ఈ రికార్డును అందుకున్నాడు రోహిత్ శర్మ. రోహిత్ 73 వన్డే మ్యాచ్ లలో 123 సిక్సర్లు కొట్టాడు. ధోని 116 ఇన్నింగ్స్ 123 సిక్సర్లు కొట్టడం గమనార్హం . ఇలా ధోని రికార్డును సమం చేశాడు రోహిత్.

మరింత సమాచారం తెలుసుకోండి: