గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయిన ఆటగాడు ఎవరు అంటే అందరూ చెప్పే పేరు సూర్య కుమార్ యాదవ్ అని. అద్భుతమైన ఆట తీరుతో ఎంతోగానో ఆకట్టుకుంటున్న సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం టి20 ఫార్మాట్లో ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్న సూర్య కుమార్ యాదవ్ అటు వన్డే ఫార్మాట్లో కూడా సత్తా చాటుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ ఫార్మాట్లో కూడా ఇక సుదీర్ఘమైన ఫార్మాట్లోకి అరంగేట్రం చేసి సత్తా చాటెందుకు సిద్ధమవుతున్నాడు.


 ఈ క్రమంలోనే ఇక ఇటీవలే ఇదే విషయంపై మాట్లాడుతున్నా ఎంతో మంది ఆటగాళ్లు సూర్యకుమార్ టెస్ట్ ఫార్మాట్లో కూడా అద్భుతంగా రానించగలడు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం సూర్యకుమార్ కు బదులు మరొకరిని తీసుకొని ఉంటే బాగుండేది అని అభిప్రాయపడుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఇక ఇటీవల కాలంలో అటు బీసీసీఐ ఆస్ట్రేలియా తో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ఇటీవలే ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ అజారుద్దీన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టి20 ఫార్మాట్లో అదరగొడుతున్న సూర్య కుమార్ యాదవ్ ఆస్ట్రేలియా తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో కూడా కీలక పాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు అజారుద్దీన్. ఇక ఒక ఆటగాడు ఫామ్ లో ఉన్నప్పుడు అతడిని బెంచ్ కి పరిమితం చేయడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. సూర్య కుమార్ యాదవ్ అని ఫార్మాట్లకు తగ్గ ఆటగాడని.. అతడి బ్యాటింగ్ చూసిన తర్వాత ఒకే మాట చెప్పాలనిపిస్తుంది అంటూ అజారుద్దీన్ తెలిపాడు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మాదిరిగానే సూర్య కుమార్ యాదవ్ సైతం అన్ని ఫార్మాట్ల ఆటగాడు అంటూ వ్యాఖ్యానించాడు  అజారుద్దీన్.

మరింత సమాచారం తెలుసుకోండి: