గత కొంతకాలం నుంచి భారత జట్టు నుంచి ప్రక్షాళనకు గురైన ఆటగాళ్ళలో అజింక్య రహానే కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు భారత టెస్టు జట్టులో తన స్థానం ఎప్పుడూ సుస్థిరంగా ఉండేది అని చెప్పాలి.  అంతేకాదు ఇక రెగ్యులర్ కెప్టెన్ అందుబాటులో లేని సమయంలో ఏకంగా సారధ్య బాధ్యతలను కూడా అందుకొని జట్టును ముందుకు నడిపించేవాడు. ఇక విరాట్ కోహ్లీ అందుబాటులో లేని సమయంలోనే ఇక  ఆస్ట్రేలియాలో భారత జట్టు సారధ్య బాధ్యతలు అందుకున్న అజింక్య రహానే చారిత్రాత్మక విజయాన్ని అందించాడు అన్న విషయం తెలిసిందే.


 ఇలా జట్టులో కీలక ఆటగాడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన అజంక్య రహనే ఆ తర్వాత కాలంలో మాత్రం నిలకడలేమి కారణంగా ఇక జట్టు నుంచి వేటుకు గురయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇక మళ్ళీ భారత జట్టులో అవకాశం దక్కించుకునేందుకు ఎంతలా ప్రయత్నించినప్పటికీ అతనికి మాత్రం ఛాన్స్ రావడం లేదు. ఎంతోమంది యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్న నేపథ్యంలో  ఇక వారిని తుది జట్టులోకి తీసుకునేందుకే బీసీసీఐ కలెక్టర్లు మొగ్గు చూపుతున్నారు.  కాగా ఒకప్పుడు జట్టులో  కీలక ఆటగాడిగా కొనసాగిన అజింక్య రహానే ఇక ఇప్పుడూ జట్టులో స్థానం కోసం మునుపటి ఫామ్ నిరూపించుకోవాల్సిన ఆటగాళ్ల లిస్టు లోకి వెళ్లిపోయాడు అని చెప్పాలి.


 కాగా ప్రస్తుతం రాంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. ఇక ఇటీవల ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో  ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తాను బాగా ఆడటంపైనే దృష్టి సారించాను అంటూ అజింక్య రహనే చెప్పుకొచ్చాడు. 2007లో రంజి క్రికెట్ లోకి  వచ్చినప్పుడు ఎలా ఉన్నానో.. ఇక ఇప్పుడు కూడా అలాగే ఉండేందుకు అలాగే ఆలోచించేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ తెలిపాడు. వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని మళ్ళీ టీమ్ ఇండియాలోకి వచ్చేందుకు కష్టపడుతున్న అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: