ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో మన్కడింగ్ అనేది ఎంత హాట్ టాపిక్ గా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతోమంది ఆటగాళ్లు తమ ప్రత్యర్థి  బ్యాట్స్మెన్ల వికెట్లు ఎంతకీ పడకపోవడంతో కొన్ని కొన్ని సార్లు ఎంతో తెలివిగా వ్యవహరించి ఐసీసీ రూల్స్ పాటించి మన కడింగ్ విధానం ద్వారా రనౌట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే.. ఇలా ఎవరైనా బౌలర్ మన్ కడింగ్ చేశారు అంటే చాలు ఏకంగా అది కాస్త ప్రపంచ క్రికెట్లో హార్ట్ టాపిక్ గా మారిపోయింది.


 ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం గురించి చర్చించుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా సదరు ఆటగాళ్లు ప్రవర్తించారు అంటూ విమర్శలు చేస్తుంటే... మరి కొంతమంది ఇక ఐసీసీ రూల్స్ ప్రకారమే ఇలాంటివి చేశారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే ఇటీవల భారత్ శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో లంక కెప్టెన్ శనకను టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ మన్కడింగ్ ద్వారా రన్ అవుట్ చేశాడు. కానీ రోహిత్ శర్మ కల్పించుకొని ఇక ఈ రన్ అవుట్ ను వెనక్కి తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఇదే విషయంపై మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్.. రోహిత్ శర్మ చేసింది ముమ్మాటికీ తప్పు అంటూ వ్యాఖ్యానించాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం మన్ కడింగ్ అనేది చట్టబద్ధం అయినప్పటికీ ఒక అనైతిక అవుట్ గా చూడటం ఇప్పటికైనా మానేయాలి అంటూ వ్యాఖ్యానించాడు. బాల్ వెయ్యక ముందే బ్యాటర్ క్రీజు వదిలి వెళ్తే అది ఎలా కరెక్ట్ అవుతుందని ప్రశ్నించాడు. బ్యాట్స్మెన్ 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్టంప్ అవుట్, ఎల్ బి డబ్ల్యూ అయితే వెనక్కి తీసుకుంటారా అంటూ ప్రశ్నించాడు రవిచంద్రన్ అశ్విన్. మన్ కడింగ్ విషయంలో ఏ కెప్టెన్ జోక్యం చేసుకోకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. కేవలం రోహిత్ గురించి మాట్లాడటం లేదని ఓవరాల్ గా క్రికెట్లో మన్ కడింగ్ అనైతికం అనడం సరికాదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: