ప్రస్తుతం కొత్త ఏడాదిలో కూడా టీమిండియా ఎప్పటిలాగే వరుసగా ద్వైపాక్షక సిరీస్ లతో ఎంతో బిజీ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టుతో టి20, వన్డే సిరీస్ లు ఆడి రెండు సిరీస్లను కైవసం చేసుకున్న టీమిండియా ఇక ఇప్పుడు ఇండియా పర్యటనలో ఉన్న కివీస్ జట్టుతో కూడా వన్డే సిరీస్ ఆడటానికి సిద్ధమైంది అని చెప్పాలి. కాగా నేడు మొదటి వన్డే మ్యాచ్ అటు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతుంది.


 అయితే ఉప్పల్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అటు టీమ్ ఇండియా వన్డే మ్యాచ్ ఆడబోతుంది. 2019లో చివరిసారిగా ఇక ఈ స్టేడియంలో వన్డే మ్యాచ్ ఆడింది టీం ఇండియా. తర్వాత ఇక్కడ ఒక్క వన్డే మ్యాచ్ కూడా జరగలేదు. అయితే ఇక ఉప్పల్ స్టేడియంలో నేడు మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం టీమిండియా గత గణాంకాలు మాత్రం ప్రేక్షకులను భయపెడుతున్నాయి అని చెప్పాలి. ఇప్పటివరకు భారత జట్టు ఉప్పల్ స్టేడియంలో ఆరు వన్డే మ్యాచ్ లు ఆడింది.  ఇక ఆరింటిలో మూడింటిలో మాత్రమే విజయం సాధించి ఇక మూడు మ్యాచ్లలో ఓటమి చెపు చూసింది అని చెప్పాలి.


 2005లో సౌత్ ఆఫ్రికా భారత్ మ్యాచ్కు తొలిసారి ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వగా.. ఇందులో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2007, 2009లో ఆస్ట్రేలియాతో రెండు వన్డే మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరగగా.. రెండింటిలోనూ ఆస్ట్రేలియా అనే విజయం సాధించటంతో సొంత గడ్డపై భారత్కు షాక్ తగిలింది. ఇక 2011లో ఇంగ్లాండ్పై, 2014లో శ్రీలంక పై, 2019లో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా విజయం విజయం సాధించడం గమనార్హం. ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్ లో కూడా భారత్ విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ఇక గత గణాంకాలు చూసుకుంటే భారత్ కు విజయం సాధించే అవకాశాలు 50- 50 అన్నట్లుగానే ఉన్నాయి అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: