ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లో తన హవాని నడిపించి ప్రపంచ వ్యాప్తంగా కూడా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు అని చెప్పాలి.  అంతే కాదు నేటి జనరేషన్ క్రికెటర్లలో ఇక ఎవరికి సాధ్యం కాని రీతిలో ఎన్నో రికార్డులు సాధించి అందనంత దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో కూడా నెంబర్ వన్ ఆటగాడిగా హవా నడిపించాడు అన్న విషయం తెలిసిందే. కానీ గత మూడు ఏళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ నెంబర్ వన్ ర్యాంక్ నుంచి క్రమక్రమంగా కిందికి పడిపోతూ వచ్చాడు అని చెప్పాలి. అయితే ఆసియా కప్లో మునుపటి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మళ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్  కొనసాగిస్తూ దూసుకుపోతున్నాడు. వరుసగా సెంచరీలతో చలరేగిపోతున్నాడు అని చెప్పాలి. కేవలం నెలల వ్యవధిలోనె నాలుగు సెంచరీలు చేసి అదరగొట్టాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ర్యాంకింగ్స్ లో అంతకంతకు పైకి ఎగబాకుతూ వస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఏకంగా రెండు సెంచరీలతో చెలరేగిపోయాడు విరాట్ కోహ్లీ.


 ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో కూడా అటు విరాట్ కోహ్లీ అదరగొట్టాడు అని చెప్పాలి. ఇటీవలే జరిగిన వన్డే సిరీస్లో 283 పరుగులు చేసి అదరగొట్టిన కోహ్లీ.. వన్డే ర్యాంకింగ్ 750 పాయింట్లతో దుమ్ము రేపాడు. దీంతో నాలుగవ స్థానానికి చేరుకున్నాడు అని చెప్పాలి. ఈ లిస్టులో తొలి స్థానంలో 887 పాయింట్ లతో బాబర్ అజం రెండవ స్థానంలో 766 పాయింట్లు సౌత్ ఆఫ్రికా క్రికెటర్ వాండర్ డస్సేన్ మూడవ స్థానంలో 759 పాయింట్లు డికాక్ కొనసాగుతూ ఉన్నాడు. ఇక ప్రస్తుతం సెంచరీలతో విరాట్ కోహ్లీ చెల్లరేగిపోతున్న తీరు చూస్తే మరికొన్ని రోజుల్లో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోవడం ఖాయం అన్నది తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: